ఏడేళ్ల తర్వాత డైరెక్టర్ గా ఛాన్స్

0
38
chiru doing film with meher ramesh

టాలీవుడ్ మూవీ న్యూస్,హైద్రాబాద్మెగాస్టార్ చిరంజీవి మెహర్ రమేష్ కు ఏడేళ్ల తర్వాత డైరెక్టర్ గా ఛాన్స్ ఇస్తున్నాడు. మెహర్ రమేష్ 2013 లో వచ్చిన షాడో చిత్రానికి దర్శకత్వం వహించాడు ఆ సినిమా డిజాస్టర్ కావడంతో మళ్ళీ మెహర్ రమేష్ కు డైరెక్టర్ గా ఎవరూ ఛాన్స్ ఇవ్వలేదు కట్ చేస్తే ఏడేళ్ల తర్వాత మాత్రం అతడి నిరీక్షణ ఫలించి ఏకంగా మెగాస్టార్ చిరంజీవి ఛాన్స్ ఇస్తున్నాడు. మెగా ఫోన్ పట్టి స్టార్ట్ కెమెరా , యాక్షన్ అని అనే వాళ్ళు తప్పనిసరిగా మెగాస్టార్ ని డైరెక్ట్ చేయాలనీ ఆశపడతారు అయితే ఆ గోల్డెన్ ఛాన్స్ అందరికీ లభించదు కానీ మెహర్ రమేష్ కు మాత్రం ఇన్నాళ్ల తర్వాత అందునా ప్లాప్ లలో ఉన్న సమయంలో ఛాన్స్ రావడం అంటే నిజంగా గొప్ప విషయమే.

మెహర్ రమేష్ మెగాస్టార్ చిరంజీవికి బంధువు కూడా. ఇక మహేష్ బాబు హీరోగా నటించిన బాబీ చిత్రంలో మహేష్ బాబు స్నేహితుడిగా నటించాడు మెహర్ రమేష్. ఆ తర్వాత కన్నడ సినిమాలకు దర్శకత్వం వహించాడు. ఆ అనుభవంతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కంత్రి అనే సినిమా చేసాడు మెహర్ రమేష్ ఈ సినిమా పెద్ద హిట్ కాదు కానీ మంచిగానే ఆడింది. ఆ సినిమా తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో బిల్లా అనే యాక్షన్ సినిమా చేసాడు. బిల్లా కూడా పెద్ద హిట్ కాదు కానీ హిట్ చిత్రంగా నిలిచింది.

ఆ తర్వాత ఎన్టీఆర్ మళ్ళీ మెహర్ రమేష్ కు ఛాన్స్ ఇచ్చాడు దాంతో శక్తి అనే  భారీ బడ్జెట్ సినిమా చేసారు అయితే ఈసారి పెద్ద దెబ్బే కొట్టింది. శక్తి డిజాస్టర్ అయ్యింది . ఆ సినిమా తర్వాత సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ హీరోగా షాడో అనే సినిమా చేసాడు మెహర్ రమేష్. ఇక షాడో కూడా డిజాస్టర్ అయ్యింది. దాంతో తీవ్ర నిరాశకు లోనయ్యాడు మెహర్ రమేష్. ఇక అప్పటి నుండి పలుమార్లు సినిమా చేయాలనీ ప్రయత్నించాడు కానీ కుదరలేదు. కట్ చేస్తే ఏడేళ్ల తర్వాత మెహర్ రమేష్ రీ ఎంట్రీ ఇస్తున్నాడు అది కూడా మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించే చిత్రానికి దర్శకత్వం వహించే అదృష్టం లభించడం అంటే సక్సెస్ అయితే మెహర్ రమేష్ దశ తిరిగినట్లే. 

మునుపటి వ్యాసంహైదరాబాద్ లో పరువు హత్య
తదుపరి ఆర్టికల్ఎస్పీ బాలు కన్నుమూత
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి