పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేస్తున్నారట

0
39
catherine tresa green signal to marriage proposal

తనని త్వరగా పెళ్లి చేసుకోవాలని ఇంట్లో ఒత్తిడి చేస్తున్నారని అంటోంది హీరోయిన్ కేథరిన్ ట్రెసా. తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ భాషల్లో పలు చిత్రాల్లో నటించి హాట్ ఇమేజ్ సొంతం చేసుకుంది భామ. ఒంటి మీదకు 30 ఏళ్ళు వచ్చాయి అవి కూడా పూర్తి అవుతున్నాయి దాంతో పెళ్ళిపోరు పెడుతున్నారట కేథరిన్ పేరెంట్స్. ఎలాగూ చేతిలో పెద్దగా సినిమాలు లేకుండాపోయాయి కాబట్టి పెళ్లి చేసుకుంటే పనైపోతుందని అంటున్నారట.

ఇక కేథరిన్ ట్రెసా కూడా ఇంట్లో వాళ్ళ పోరు పడలేక పెళ్ళికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా ఇస్తుందేమో ! దక్షిణాదిన హీరోయిన్ గా వెలుగు వెలిగి పోవాలని ఆశపడింది పాపం భామ కానీ సోలో హీరోయిన్ గా ఛాన్స్ లు అంతగా రాలేదు . సెకండ్ , థర్డ్ హీరోయిన్ గా ఛాన్స్ లు వచ్చాయి. అలాగే ఐటెం సాంగ్స్ కూడా చేసింది కేథరిన్ ట్రెసా. సెకండ్ హీరోయిన్ గా నటించడంలో తప్పేముందని కూడా అంటోంది కేథరిన్. మొత్తానికి సినిమాలు లేవు కనుక పెళ్లి చేసుకోవడం ఖాయమే అనుకుంటా

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి