నటి మాధవీలతపై కేసు నమోదు

0
49
madhavi latha bjp leader

నచ్చావులే చిత్రంతో టాలీవుడ్ లో అడుగు పెట్టి మొదటి చిత్రంతోనే సంచలన విజయం అందుకున్న భామ మాధవీలత. అయితే ఈ భామ ఇటీవల కాలంలో ఎక్కువగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ పలు వివాదాల్లో ఇరుక్కుంటోంది. తాజాగా ఈ భామ పై పోలీసులు కేసు నమోదు చేయడం విశేషం. పైగా ఆ కేసు నమోదు కావడానికి మాధవీలత వివాదాస్పద వ్యాఖ్యలు అందునా కొంతమంది హిందువులపై చేయడం తో కావడం గమనార్హం. హిందూ పార్టీ అయిన భారతీయ జనతా పార్టీలో కొనసాగుతోంది మాధవీలత. అలాంటి రాజకీయ పార్టీలో కొనసాగే ఈ భామ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిందని గోపికృష్ణ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో 295 ఏ సెక్షన్ కింద ఆమెపై కేసు నమోదు చేసారు రాచకొండ పోలీసులు.

భారతీయ జనతా పార్టీలో కొనసాగుతున్నప్పటికీ పవన్ కళ్యాణ్ అంటే బాగా ఇష్టం ఈ భామకు. అలాగే ఇటీవల పార్టీలో పలు పదవులను ఆశించింది కానీ ఏ పదవి కూడా దక్కలేదు దాంతో తీవ్ర అసహనానికి లోనై చాలా పెద్ద ఎత్తున వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది మాధవీలత. పని చేసే వాళ్ళకంటే పక్కలో పడుకునే వాళ్లకే పదవులు లభిస్తున్నాయని వ్యాఖ్యానించి సంచలనం సృష్టించింది.

సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే మాధవీలత పలు అంశాలపై ఎప్పటికప్పుడు తన అభిప్రాయాలను అభిమానులతో పంచుకుంటోంది. అలాగే తనని విమర్శించే వాళ్లకు కూడా గట్టిగానే బుద్ది చెబుతోంది. నచ్చావులే చిత్రం సూపర్ హిట్ అయినప్పటికీ తనకు ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదని అందుకు కారణం కాస్టింగ్ కౌచ్ అంటూ అప్పట్లోనే పెద్ద ఎత్తున ఆరోపణలు చేసింది మాధవీలత. అయితే అప్పట్లో ఈ భామ వ్యాఖ్యలు పెద్దగా వైరల్ కాలేదు కానీ శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలు యావత్ ఫిలిం ఇండస్ట్రీని షేక్ చేసాయి. 

మునుపటి వ్యాసంతమ్ముడి కోసం నిర్మాతగా మారుతున్న విజయ్ దేవరకొండ
తదుపరి ఆర్టికల్ఆ హీరోకు లిప్ లాక్ ఇవ్వడానికి చాలా ఇబ్బంది పడిందట
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి