కరోనాతో సహజీవనం తప్పదంటున్న కేసీఆర్ : 2200 కరోనా రోగులు ఎక్కడ?

0
43

కరోనాతో సహజీవనం తప్పదని మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. నిన్న సాయంత్రం ప్రగతి భవన్ లో వైద్యాధికారులతో సమావేశం నిర్వహించిన కేసీఆర్ పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. కరోనా వస్తే భయపడాల్సిన అవసరం లేదని, అలాగే నాకెందుకు వస్తుంది అనే నిర్లక్ష్యం కూడా చేయొద్దని …… ఎంతమంది రోగులకైనా సేవ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. వైద్య సిబ్బంది అహోరాత్రులు శ్రమిస్తూ కరోనా రోగులకి సేవలు అందిస్తున్నారని ఇలాంటి సమయంలో ప్రభుత్వం పై , వైద్యులపై ఆరోపణలు చేయడం తగదని ప్రతిపక్షాలకు చురకలు అంటించాడు కేసీఆర్.

కరోనా భయంతో కొంతమంది ప్రయివేటు ఆసుపత్రులకు వెళ్తున్నారని , అలా హైరానా పడిపోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. అయితే ముఖ్యమంత్రి చెబుతున్న విషయాలు బాగానే ఉన్నాయి కానీ కింది స్థాయిలో ఆ విధంగా లేదు. కరోనా పాజిటివ్ వచ్చిన వాళ్ళను కూడా హోం ఐసోలేషన్ లో ఉండాలని బెడ్స్ ఖాళీ లేవని సూచనలు ఇస్తున్నారు వైద్యులు. ఇక ఒక్క హైదరాబాద్ మహానగరంలోనే 2200 మంది కరోనా రోగులు హోం ఐసోలేషన్ లో ఉంటామని చెప్పి తప్పుడు అడ్రస్ లని ఇవ్వడమే కాకుండా తప్పుడు ఫోన్ నెంబర్ లను ఇచ్చారని అధికారులు చెబుతున్నారు. హోం ఐసోలేషన్ కిట్స్ ఇవ్వాలని ఆయా అడ్రస్ లలో సంప్రదించగా అవి తప్పుడు అడ్రస్ లని తేలాయి అలాగే ఇచ్చిన ఫోన్ నెంబర్ లు కూడా తప్పుడువే దాంతో హైదరాబాద్ లోని అధికారులకు చెమటలు పడుతున్నాయి. 2200 మంది కరోనా రోగులు ఇంట్లోనే ఉంటున్నారా ? లేక జనాల మధ్య తిరుగుతూ మిగతా వాళ్లకు కూడా అంటిస్తున్నారా ? అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు.  

మునుపటి వ్యాసంఎం ఎల్ సి గా పోటీ చేయనున్న కోదండరాం
తదుపరి ఆర్టికల్బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ డూప్ జూనియర్ రణబీర్ కపూర్ మృతి
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి