ఎన్టీఆర్ కు కరోనా టెస్ట్

0
43
rrr team

టాలీవుడ్ మూవీ న్యూస్,హైద్రాబాద్యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు కరోనా టెస్ట్ చేసారు. ఎన్టీఆర్ కు కరోనా టెస్ట్ ఎందుకు చేసారో తెలుసా …… సోమవారం నుండి ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ లో పాల్గొంటున్నాడు అందుకే కరోనా టెస్ట్ చేసారు. షూటింగ్ చేయాలంటే షూటింగ్ లో పాల్గొనే వాళ్లందరికీ కోవిడ్ 19 టెస్ట్ తప్పనిసరి మరి అందుకే ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ లో పాల్గొనే వాళ్లందరికీ అలాగే ఆర్ ఆర్ ఆర్ టీమ్ కు అందరికి కరోనా టెస్ట్ లు చేసారు. నెగెటివ్ వచ్చిన వాళ్లతో కలిసి ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ మొదలు కాబోతోంది.

రేపటి నుండి యంగ్ టైగర్ ఎన్టీఆర్ పై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు దర్శకులు ఎస్ ఎస్ రాజమౌళి. ఆగస్టు నెలలో దర్శకులు ఎస్ ఎస్ రాజమౌళి కుటుంబానికి అలాగే సంగీత దర్శకులు ఎం ఎం కీరవాణి కుటుంబానికి కూడా కరోనా సోకిన విషయం తెలిసిందే. అయితే కరోనా ని జయించారు జక్కన్న , కీరవాణి. ఇక కరోనా కాస్త తగ్గుముఖం పట్టి మళ్ళీ షూటింగ్ లకు సిద్ధం అవుతున్నారు సినీ జనాలు.

అయితే పలు నిబంధనలు విధించింది ప్రభుత్వం అందుకే కోవిడ్ నిబంధనలను పాటిస్తూ ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ చేయడానికి రెడీ అయ్యాడు జక్కన్న. ఇక ఎన్టీఆర్ పై కీలక సన్నివేశాలను చిత్రీకరించి దసరా నాటికి ఎన్టీఆర్ కు సంబందించిన టీజర్ ని విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నాడట జక్కన్న. ఇంతకుముందు చరణ్ వీడియో ని విడుదల చేసాడు కానీ ఎన్టీఆర్ వీడియో విడుదల కాలేదు అందుకే ఇప్పుడు ఎన్టీఆర్ పై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఎన్టీఆర్ ఈ చిత్రంలో కొమరం భీం గా నటిస్తుండగా చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ మొదలు అవుతోందంటే ఎన్టీఆర్ అభిమానులకు శుభవార్తే.

మునుపటి వ్యాసంఆందోళన కరంగా ట్రంప్ ఆరోగ్యం
తదుపరి ఆర్టికల్టాలీవుడ్ హీరోయిన్ ల రెమ్యునరేషన్
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి