కరోనా నుండి కోలుకున్న హీరోయిన్

0
68

బుల్లితెర నటి నవ్య స్వామి కరోనా నుండి కోలుకుంది. గత నెల 30 న కరోనా బారిన పడింది నవ్య స్వామి. తెలుగులో పలు సీరియల్ లలో హీరోయిన్ గా నటించిన ఈ భామ సీరియల్ షూటింగ్ కు వెళ్లి కరోనా బారిన పడింది. దాంతో హోం క్వారంటైన్ లోనే ఉండి చికిత్స పొందింది నవ్య. హోం క్వారంటైన్ పూర్తి కావడంతో ఓ వీడియో రూపొందించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది నవ్య.

తనకు హోం క్వారంటైన్ పూర్తయిందని , ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నానని అయితే కరోనా వచ్చిన సమయంలో చుట్టుపక్కల వాళ్ళు మా ఇంటి దరిదాపుల్లోకి రావడానికి కూడా భయపడ్డారని అలాగే మమ్మల్ని చులకన చేసి చూశారని నిజానికి కరోనా భయం కంటే చుట్టుపక్కల వాళ్ళ చూపులు మరింతగా బాధపెట్టాయని …… ఇప్పటికైనా సమాజం మరాల్సిన అవసరం ఉందని అంటోంది. ఇక కరోనా నుండి కోలుకోవడానికి ప్రజలు , అభిమానులు అందించిన ప్రేమే కారణమని కృతజ్ఞతలు తెలిపింది నవ్య స్వామి. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. దాంతో గ్రేటర్ హైదరాబాద్ నుండి 30 లక్షలకు పైగా జనాలు వెళ్లిపోయారు. ఒకవైపు పనులు లేకపోవడం , మరోవైపు కరోనా విలయతాండవం చేస్తుండటంతో పెద్ద ఎత్తున ప్రజలు హైదరాబాద్ నుండి వెళ్లిపోయారు.

మునుపటి వ్యాసంహైదరాబాద్ మేయర్ కు కరోనా
తదుపరి ఆర్టికల్మరో చరిత్ర సృష్టించిన మహేష్ బాబు
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి