కారుకి యాక్సిడెంట్ : హీరోయిన్ కి గాయాలు

0
40
rishi

కన్నడ హీరోయిన్ రిషికా సింగ్ ప్రయాణిస్తున్న కారు యాక్సిడెంట్ కు గురయ్యింది దాంతో కారులో ఉన్న రిషికా సింగ్ తో పాటుగా మరో ఇద్దరికి గాయాలు అయ్యాయి. వెంటనే వాళ్ళని బెంగుళూరు లోని ఓ ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం ఇంటికి చేరుకున్నారు హీరోయిన్. ఈ సంఘటన రెండు రోజుల క్రితం జరుగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే కారు యాక్సిడెంట్ అయితే , హీరోయిన్ ఆసుపత్రిలో చికిత్స పొందితే ఎలాంటి కేసు కూడా నమోదు కాకపోవడంతో పోలీసులపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పలువురు.

బెంగుళూరు సమీపంలోని ప్రధాన రహదారి లోనే ఈ యాక్సిడెంట్ జరిగింది. పైగా కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టుకు గుద్దుకోవడంతో కారు దెబ్బతింది అలాగే చెట్టు కూడా దెబ్బతింది. ఇంత జరిగినా పోలీసులు ఎలాంటి కేసు పెట్టలేదు. ఇక హీరోయిన్ రిషికా సింగ్ విషయానికి వస్తే కన్నడలో పలు చిత్రాల్లో నటించింది. కారులో ఆమెతో పాటుగా మరో ఇద్దరు ఉన్నారట. రిషికా సింగ్ తో పాటుగా నటుడు జై జగదీష్ కూతురు కూడా ఉంది అలాగే రిషికా సింగ్ స్నేహితుడు ఆర్య కారు డ్రైవ్ చేస్తున్నప్పుడు అదుపుతప్పి చెట్టుకు ఢీకొట్టాడట. రిషికా సింగ్ తో పాటుగా మిగతా వాళ్లకు కూడా గాయాలు అయ్యాయి కానీ భారీ ప్రమాదం కాదని తేల్చారు డాక్టర్లు. దాంతో ఇంట్లో విశ్రాంతి తీసుకుంటోంది రిషికా సింగ్.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి