బూతులు తిడుతున్న షకీలా

0
54

అన్నం తింటున్నారా? లేక  గడ్డి తింటున్నారా ?ఒక అమ్మకు అబ్బకు పుట్టారా?  వడ్డీలు కట్టలేక మూడేళ్ళక్రితం నాటి సినిమాను ఓటీటీ లో విడుదల చేస్తే దాన్ని పైరసీ చేస్తారా ? అంటూ బూతులు తిడుతోంది షకీలా. మూడేళ్ల క్రితం షకీలా నిర్మాతగా మారి నిర్మించిన చిత్రం లేడీస్ నాట్ అలౌడ్. ఈ సినిమా నిర్మాణం కోసం అప్పులు చేసిందట. ఆ వడ్డీలు కట్టలేక , థియేటర్ లో సినిమాని విడుదల చేయలేక ఓటీటీ లో విడుదల చేసింది. ఇప్పటికే 4 వేలకు పైగా జనాలు చూసారు. అలా చూసిన వాళ్ళు మిగతా వాళ్లకు చెబుతున్నారు దాంతో నా పెట్టుబడులు వస్తాయని ఆశగా ఎదురు చూస్తున్న సమయంలో పైరసీకి పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ బూతులు తిడుతోంది షకీలా.

ఒకప్పుడు షకీలా సినిమా విడుదల అవుతోందంటే చాలు అప్పటి మలయాళ స్టార్ హీరోలు సైతం భయపడేవాళ్ళు. అంతటి స్టార్ డం ఉండేది షకీలాకు. ఆమె నటించిన చిత్రాలకు విపరీతమైన డిమాండ్ ఉండేది కానీ కాలం మారింది దాంతో షకీలాకు క్రేజ్ తగ్గింది. చేతిలో అప్పట్లో బాగానే డబ్బుండేది కానీ నమ్మినవాళ్ళు మోసం చేయడంతో ఆర్ధికంగా కూడా నష్టపోయింది. ఒకవైపు క్రేజ్ తగ్గడం , మరోవైపు ఆర్ధిక ఇబ్బందులు ఎదురవ్వడంతో లేడీస్ నాట్ అలౌడ్ చిత్రంపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. కట్ చేస్తే ఇది పైరసీ బారిన పడటంతో షకీలా కడుపు రగిలిపోతోంది.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి