బ్రేకింగ్ న్యూస్: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు కరోనా

0
72
amith sha

బ్రేకింగ్ న్యూస్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్ అని తేలింది. స్వయంగా అమిత్ షా ఈ విషయాన్ని ప్రకటించాడు. ఒంట్లో బాగలేకపోవడంతో కరోనా టెస్ట్ చేయించుకున్నాడు. ఆ టెస్ట్ లో కరోనా పాజిటివ్ అని తేలింది. దాంతో తనని ఈ మధ్య కలిసిన వాళ్ళు వెంటనే కరోనా టెస్ట్ చేయించుకోవాలని ట్వీట్ చేసాడు అమిత్ షా. దాంతో అమిత్ షా ని కలిసిన వాళ్ళ గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. అలాగే అమిత్ షా ఆరోగ్యం గురించి పలువురు ప్రముఖులు వాకబు చేస్తుండటంతో ప్రస్తుతం నేను ఆరోగ్యంగానే ఉన్నాను ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు అమిత్ షా.

ఈనెల 5 అయోధ్యలో జరిగే రామాలయ భూమి పూజకు అమిత్ షా హాజరు కావాల్సి ఉంది. కానీ ఈలోపు అమిత్ షాకు కరోనా సోకడంతో ఇక హాజరు కావడం కష్టమే. ప్రస్తుతం అమిత్ షా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కేంద్ర హోంశాఖ మంత్రికే కరోనా సోకిందంటే కరోనా ఎంత దారుణంగా విలయతాండవం చేస్తోందో అర్థం చేసుకోవచ్చు.

మునుపటి వ్యాసంద‌గ్గుబాటి రానా విడుద‌ల చేసిన ‘ఆకాశ‌వాణి’ఫ‌స్ట్ లుక్
తదుపరి ఆర్టికల్ఆ చిత్రంలో నటించడానికి 3 కోట్లు డిమాండ్ చేసిందట
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి