బ్రేకింగ్ న్యూస్: వరవరరావు కు కరోనా

0
56

ప్రజాకవి వరవరరావుకు కరోనా సోకింది. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వరవరరావు ని ముంబై లోని జేజే ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా సోకినట్లు తేలింది. వరవరరావు కు కరోనా సోకిన విషయం కుటుంబ సభ్యులకు తెలియజేసారు జైలు అధికారులు. దాంతో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కుటుంబ సభ్యులు. వరవరరావు గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. దాంతో ఏడాది కాలంగా అతడిని బెయిల్ పై విడుదల చేయాలని కేంద్ర , మహారాష్ట్ర ప్రభుత్వాలను కుటుంబ సభ్యులు వేడుకుంటున్నప్పటికీ స్పందించలేదు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హత్యకు మావోయిస్టు లతో కలిసి కుట్ర పన్నాడని వరవరరావు ని ఎన్ ఐ ఏ అధికారులు అరెస్ట్ చేసి మహారాష్ట్ర కు తరలించారు. ఒకవైపు కరోనా దేశంలో విలయతాండవం చేస్తుండటంతో వరవరరావుని బెయిల్ పై విడుదల చేయాలని పలువురు రాజకీయ ప్రముఖులు డిమాండ్ చేస్తున్నప్పటికీ కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం పట్టించుకోవడం లేదు. దాంతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ని ఈ విషయంలో జోక్యం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు కుటుంబ సభ్యులు. విప్లవ సాహిత్యవేత్త వరవరరావు వై ఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి గా ఉన్న సమయంలో నక్సలైట్ లతో చర్చించడానికి మధ్యవర్తిగా వ్యవహరించిన విషయం తెలిసిందే.  

మునుపటి వ్యాసంమాస్క్ ప్రాధాన్యత చెబుతూ చిరు చేసిన వీడియో వైర
తదుపరి ఆర్టికల్ఈ హీరో క్రేజ్ ఏంట్రా బాబూ! దిమ్మతిరిగేలా ఉందే
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి