బ్రేకింగ్ న్యూస్: సుశాంత్ కేసు సీబీఐ కి అప్పగింత

0
53
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసుని సీబీఐకి అప్పగించి సంచలనం సృష్టించింది కేంద్ర ప్రభుత్వం. బాలీవుడ్ హీరో సుశాంత్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఎంతో మంచి భవిష్యత్తు ఉన్న సుశాంత్ అకస్మాత్తుగా ఆత్మహత్య చేసుకున్న విషయం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించగా ముంబై పోలీసులు నెల రోజులకు పైగా విచారణ చేపట్టి ఆత్మహత్య గానే నిర్దారించారు. అయితే ముంబై పోలీసులు ఇలా నిర్దారణకు రావడానికి కారణం రాజకీయ ఒత్తిడి కారణం అంటూ బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి వివాదాస్పద వ్యాఖ్యలు చేసాడు. అంతేకాదు సీబీఐ విచారణ చేపట్టాలని కేంద్రాన్ని కోరాడు.

దానికి తోడు సుశాంత్ సింగ్ తండ్రి బీహార్ పోలీసులను కలిసి సమగ్ర విచారణ చేపట్టాలని కోరడంతో బీహార్ కమీషనర్ సానుకూలంగా స్పందించారు. అలాగే బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా సుశాంత్ కేసుని సీబీఐ కి అప్పగించి అసలు దోషులను పట్టుకోవాలని, సుశాంత్ మరణంలో దాగున్న అసలు నిజాలను వెలికి తీయాలని కేంద్రాన్ని కోరాడు. నితీష్ కుమార్ కోరడమే ఆలస్యం కేంద్రం సుశాంత్ కేసుని సీబీఐకి అప్పగిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో హీరోయిన్ రియా చక్రవర్తి కి దిమ్మ తిరిగేలా షాక్ ఇచ్చింది. రియా తనపై నమోదు అయిన కేసుని బీహార్ నుండి ముంబై కి మార్చాలని కోరినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. రియా ప్రస్తుతం అజ్ఞాతవాసంలో ఉంది. దాంతో ఆమెపై మరిన్ని అనుమానాలు బలపడుతున్నాయి.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి