శుభ్రత అనేది ఈరోజు సామాజిక భాద్యత – బోయపాటి శ్రీను.

0
17
Director Boyapati Srinu is the Keraf Address to the Mass

పది రోజులుగా మీడియాలో కరోనా వైరస్ మీద ప్రచారం జరుగుతున్నట్లే..ఆ వైరస్ నుంచి ప్రమాదం కూడా రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. అందుకనే ఈ చిన్న విషయాన్ని మీతో పంచుకుంటున్నాను..“భారతీయ జీవన విధానం ప్రపంచ దేశాలకు ఆదర్శవంతమైనది. మన ఆహారపు అలవాట్లు, మన ఆరోగ్య సూత్రాలు మన పెద్దలు మనకు ఇచ్చినటువంటి ఆస్తులు. అందులోనే ఎంత పెద్ద ప్రమాదానికైనా సమాధానం ఉంది అని ప్రతి ఒక్కరికి తెలుసు.

ఈ కరోనా వైరస్ కాదుకదా..దేన్నయినా ఢీకొట్టగల పరిస్థితులలోనే మనం ఉన్నాం. చేయాల్సిందెల్లా క్రమ శిక్షణతో వాటిని పాటించడం. ఎందుకంటే ఒకానొకప్పుడు శుభ్రత అనేది అవసరం. ఈరోజు భాద్యత, సామాజిక భాద్యత. అందుకనే ప్రపంచ దేశాధినేతలు, ఎందరో పెద్దలు, మన ప్రధాన మంత్రి మోడీ గారు..ఇలా అందరూ `ఇంటిపట్టునే ఉండండి. కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేయండి, మనది అధిక జనాభా కలిగిన దేశం ఒక్కసారి వ్యాప్తి చెందింది అంటే కట్టడి చేయడం కష్టం` అని మనకు సూచనలు, సలహాలు ఇస్తున్నారు. అందుకనే దయచేసి ప్రతి ఒక్కరు వారికి సపోర్ట్ గావెళ్దాం. ఇది పాటిద్దాం. అందరం బాగుందాం. మన దేశాన్ని కాపాడుకున్న వారిలో మనం కూడా ఒకరిమవుదాం. మళ్ళీ చెబుతున్నాను. శుభ్రత అనేది ఒకానొకప్పుడు అవసరం..ఈరోజు సామాజిక భాద్యత. దయచేసి అందరూ ఆచరిస్తారని ఆశిస్తూ“.. మీ బోయపాటి శ్రీను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి