బాలీవుడ్ లో మరో విషాదం డైరెక్టర్ రాజత్ ముఖర్జీ మృతి

0
26
bollywood director

రోడ్, ప్యార్ తునే క్యా కియా , లవ్ ఇన్ నేపాల్ , ఇష్క్ కిల్స్  తదితర చిత్రాలకు దర్శకత్వం వహించిన  రాజత్ ముఖర్జీ కన్నుమూశారు దాంతో బాలీవుడ్ లో మరో విషాదం నెలకొంది. గతకొంత కాలంగా బాలీవుడ్ లో పలువురు ప్రముఖులు వరుసపెట్టి మరీ మృత్యువాత పడుతున్నారు. ఇప్పటికే ఈ ఏడాదిలో పలువురు ప్రముఖులు చనిపోగా తాజాగా బాలీవుడ్ దర్శకుడు రాజత్ ముఖర్జీ అనారోగ్యంతో మరణించారు. దాంతో బాలీవుడ్ లో విషాదం చోటుచేసుకుంది. వరుస మరణాలతో , కరోనా బారిన పడుతున్న వాళ్ళతో అతలాకుతలం అవుతోంది.

రాజత్ ముఖర్జీ కి రోడ్ అంర్ సినిమా ఎనలేని కీర్తి ప్రతిష్టలను తెచ్చిపెట్టింది. అలాగే లవ్ ఇన్ నేపాల్ , ప్యార్ తునే క్యాకీయా , ఇష్క్ కిల్స్ కూడా రాజత్ కు మంచి గుర్తింపు ని తెచ్చిపెట్టాయి. రాజస్థాన్ లోని జైపూర్ రాజత్ ముఖర్జీ స్వస్థలం కాగా అనారోగ్యంతో తన స్వగ్రామంలోనే కన్నుమూసారు రాజత్ ముఖర్జీ. పలువురు బాలీవుడ్ ప్రముఖులు రాజత్ మరణం పట్ల ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఇక బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్ పాయ్ రాజత్ మరణం పట్ల కన్నీళ్ల పర్యంతమయ్యారు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి