బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ డూప్ జూనియర్ రణబీర్ కపూర్ మృతి

0
35

బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ ని పొలినట్లుగా ఉండే జునైద్ షా గుండెపోటుతో మరణించాడు. కేవలం 28 ఏళ్ల వయసున్న జునైద్ షా కు గుండెపోటు రావడం సంచలనంగా మారింది. హీరో రణబీర్ కపూర్  పోలికలతో ఉండటంతో జూనియర్ రణబీర్ కపూర్ గా రణబీర్ కపూర్ డూప్ గా పేరుగాంచాడు. శ్రీనగర్ కు చెందిన వ్యక్తి అయినప్పటికీ జునైద్ షా ఉండేది మాత్రం ముంబైలోనే. దాంతో జునైద్ కు మరింత త్వరగా రణబీర్ కపూర్ డూప్ గా పేరు వచ్చింది. దాంతో ఫేమస్ అయ్యాడు.

అయితే తన తండ్రికి బాగోలేదని తెలియడంతో శ్రీనగర్ కు వెళ్ళాడు తండ్రి బాగోగులు చూసుకోవడానికి , కానీ అక్కడికి చేరాకా జునైద్ కు అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే జునైద్ షా మరణించిన ట్లు తెలిపారు డాక్టర్లు దాంతో జునైద్ షా కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఇక జునైద్ ని సోషల్ మీడియాలో ఫాలో అయ్యేవాళ్ళు ఈ వార్త విని మరింత కలత చెందారు. హిందీ చిత్ర పరిశ్రమలో హీరోగా ఓ వెలుగు వెళగాలని ఆశించిన జునైద్ అతి చిన్న వయసులోనే కన్నుమూయడం శోచనీయం.

మునుపటి వ్యాసంకరోనాతో సహజీవనం తప్పదంటున్న కేసీఆర్ : 2200 కరోనా రోగులు ఎక్కడ?
తదుపరి ఆర్టికల్బాబాయ్ పై సంచలన ఆరోపణలు చేసిన ఊర్మిళ
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి