సుశాంత్ ది ముమ్మాటికీ హత్యే అంటున్న బీజేపీ ఎంపీ

0
69

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ది ముమ్మాటికీ హత్యే నని మరోసారి సంచలన వ్యాఖ్యలు చేయడమే కాకుండా కొన్ని ఆధారాలను కూడా ట్వీట్ చేసి వివాదాన్ని రాజేశాడు వివాదాస్పద వ్యక్తి బీజేపీ పార్లమెంట్ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి. సుశాంత్ మరణించిన తర్వాత అది హత్యే అని అప్పట్లోనే అన్నాడు ఈ ఎంపీ. తాజాగా మహారాష్ట్ర హోం మంత్రి సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసు ముగిసినట్లే అని ప్రకటించిన కొద్దిసేపటికే సుబ్రహ్మణ్యస్వామి ఈ ట్వీట్ చేయడం పట్ల రాజకీయ దుమారం రేపుతోంది.

దుబాయ్ లో ఉన్న డాన్ కోసం సుశాంత్ కేసుని ఆత్మహత్య గా చిత్రీకరిస్తున్నారని మహారాష్ట్ర ప్రభుత్వంపై  సంచలన ఆరోపణలు చేసాడు బీజేపీ ఎంపీ. సుశాంత్ ది పక్కా హత్యే అని చెప్పడానికి ఆధారాలు ఉన్నాయని సుశాంత్ ఉరి వేసుకున్న ఆధారం సరిపోవడం లేదని, అలాగే డూప్లికేట్ కీ ఎవరి దగ్గర ఉందో ఇంతవరకు పోలీసులు స్పష్టం చేయలేదని, సుశాంత్ కు ఆర్ధిక ఇబ్బందులు లేవని …… మెడపై గుర్తులు తేడాగా ఉన్నాయి అలాగే సుశాంత్ ఇంట్లో ఉన్నవాళ్లు ఒకరు చెప్పేదానికి మరొకరు చెప్పేదానికి చాలా తేడా ఉందని ఈ ఆధారాలను బట్టి సుశాంత్ ది పక్కా హత్యే అని అంటున్నాడు. అంతేకాదు మహారాష్ట్ర ప్రభుత్వం దీన్ని తేల్చేలేదు కాబట్టి సీబీఐ విచారణ చేయిస్తే అసలు నిజాలు వెలుగులోకి వస్తాయని అంటున్నారు సుబ్రహ్మణ్యస్వామి. ఇతడి ఆరోపణలకు మరింత ఊతమిచ్చేలా ముంబై పోలీసులు ఈ కేసు గురించి మాట్లాడుకుంటున్న వీడియో కూడా లీక్ కావడంతో సుశాంత్ మరణం సహజ మరణం కాదని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి