అమ్మాయిలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎం ఎల్ ఏ

0
35
bjp uttarapradesh

టాలీవుడ్ మూవీ న్యూస్,హైద్రాబాద్- అమ్మాయిలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసాడు ఉత్తరప్రదేశ్ ఎం ఎల్ ఏ సురేంద్ర సింగ్. మహిళలపై అత్యాచారాలు ఆగాలంటే అది ప్రభుత్వం చేతిలో లేదని అమ్మాయిల చేతుల్లోనే ఉందని , మర్యాదగా ప్రవర్తిస్తే అమ్మాయిలపై ఎలాంటి అత్యాచారాలు జరగవని రేప్ లు జరగడానికి ముమ్మాటికీ కారకులు అమ్మాయిలు వేసుకుంటున్న డ్రెస్ లే అంటూ బాంబ్ పేల్చాడు ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎం ఎల్ ఏ సురేంద్ర సింగ్. ఇటీవల కాలంలో దేశ వ్యాప్తంగా అమ్మాయిలపై పెద్ద ఎత్తున అత్యాచారాలు జరుగుతున్నాయి.

ఇక ఉత్తరప్రదేశ్ లో అయితే ఈ అత్యాచారాల సంఖ్య పెద్ద మోతాదులో ఉంది. అమ్మాయిలు , అందునా దళిత , బహుజనుల మీద అగ్రవర్ణాలు అత్యాచారాలు చేయడమే కాకుండా రేప్ కు గురైన యువతులను దారుణంగా చంపుతున్నారు. అలాగే సామూహిక అత్యాచారాలు చేసి దారుణంగా చంపుతున్నారు. దాంతో యోగి ప్రభుత్వం పై తీవ్ర నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా ఓ దళిత యువతిని అత్యంత దారుణంగా చంపారు . ఈ సంఘటన యావత్ దేశాన్ని అతలాకుతలం చేస్తోంది.

సరిగ్గా ఇలాంటి సమయంలోనే బీజేపీ ఎం ఎల్ ఏ సురేంద్ర సింగ్ మరింతగా రెచ్చిపోయేలా వివాదాస్పద వ్యాఖ్యలు చేసాడు. అమ్మాయిల డ్రెస్ కోడ్ పై మళ్ళీ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో బీజేపీ పార్టీపై ఎం ఎల్ ఏ సురేంద్ర సింగ్ పై ప్రతిపక్షాలు , మానవ హక్కుల సంఘాల వాళ్ళు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహిళలకు రక్షణ కల్పించాల్సింది పోయి ఆరోపణలు చేస్తారా ? అంటూ మండిపడుతున్నారు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి