కొడాలి నాని బర్తరఫ్ కు బీజేపీ డిమాండ్

0
44
minister nani

టాలీవుడ్ మూవీ న్యూస్,హైద్రాబాద్-మంత్రి కొడాలి నాని ఇష్టానుసారం వ్యవహరిస్తూ వివాదాస్ప వ్యాఖ్యలు చేస్తున్నాడని , ఒక రాష్ట్రానికి మంత్రిని అనే విషయాన్ని మర్చిపోయి మాట్లాడుతున్నాడని తక్షణమే అతడ్ని మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలనీ డిమాండ్ చేస్తోంది భారతీయ జనతా పార్టీ ఏపీ శాఖ. ప్రధాని నరేంద్ర మోడీని అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి లను తమ భార్యలతో గుడి దర్శనానికి రావాలని అంటాడా ? ఒక మంత్రి హోదాలో ఉండి ఆ పదవికి తగని రీతిలో వ్యవహరిస్తున్నాడని , తిరుమల కు వచ్చే ప్రతీ అన్యమతస్థులు తప్పనిసరిగా డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనని ఇందులో ఎలాంటి మార్పు లేదని కుండబద్దలు కొట్టారు బీజేపీ నాయకులు.

ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు , రాజ్యసభ సభ్యులు జివీఎల్ తదితరులు మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించారు. నాని ని కలియుగ శిశుపాలుడుతో పోల్చారు. నాని అహంభావంకు త్వరలోనే తగిన శాస్తి జరిగి తీరుతుందని ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇక ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా నాని వ్యాఖ్యలను తప్పు పట్టాడు. నాని ప్రతిపక్షాల ఉచ్చులో పడ్డాడని ఎవరైనా సరే వ్యక్తిగత విమర్శలు చేస్తే సహించేది లేదని , ప్రతిపక్షాలు కోరుకుంది రాద్ధాంతం అయితే నాని ఆ ఉచ్చులో పడ్డాడని , ఇక ముందైనా మాట్లాడే ముందు కాస్త అలోచించి మాట్లాడాలని హితువు పలికాడు.

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటన సందర్బంగా శ్రీవారిని దర్శించుకునే సమయంలో డిక్లరేషన్ ఇవ్వాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేయగా అధికార పక్షం నుండి మంత్రి నాని తీవ్ర వ్యాఖ్యలు చేయడమే కాకుండా ఏకంగా ప్రధానమంత్రి మోడీ , ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి లపై వ్యక్తిగత దూషణలు చేయడంతో బీజేపీ నేతలు కొడాలి నానిని మంత్రివర్గం నుండి తప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. 

మునుపటి వ్యాసంఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం మరోసారి విషమించింది
తదుపరి ఆర్టికల్ఆసుపత్రికి వెళ్లి బాలుని పరామర్శించిన  కమల్ హాసన్
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి