ఆ బయోపిక్ వివాదం రేపడం ఖాయం

0
57
arthi agarwal

హీరోయిన్ ఆర్తి అగర్వాల్ బయోపిక్ తెరకెక్కించాలని సన్నాహాలు చేస్తున్నారు. ఆర్తి అగర్వాల్ బయోపిక్ అంటే తప్పకుండా వివాదాన్ని రాజేయడం ఖాయం. ఎందుకంటే సాఫీగా సాగిపోతున్న ఆర్తి అగర్వాల్ కెరీర్ లో ఓ యంగ్ హీరో విలన్ గా తయారయ్యాడు మరి. స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకొంది ఆర్తి అగర్వాల్. అయితే అదే సమయంలో అనూహ్యంగా ఓ యంగ్ హీరోతో అప్పట్లో పీకల్లోతు ప్రేమలో పడింది. ఆ హీరో కూడా ఆర్తి అగర్వాల్ ని ప్రేమించాడు. అయితే ప్రేమించడానికి ఎలాంటి అడ్డంకులు రాలేదు కానీ పెళ్లి అనుకునే సరికి చాలా అడ్డంకులు వచ్చి పడ్డాయి.

ఎందుకంటే ఆర్తి అగర్వాల్ హీరోయిన్ కాబట్టి. ఆమెని తమ కోడలిగా అంగీకరించడానికి ఆ హీరో తల్లిదండ్రులు ఒప్పుకోలేదట. దాంతో హీరో కు ఆర్తి అగర్వాల్ కు విబేధాలు వచ్చాయి. ఇంకేముంది డిప్రెషన్ కి వెళ్లిన ఆర్తి అగర్వాల్ అప్పట్లో ఆత్మహత్యకు పాల్పడింది. ఆసుపత్రిలో చేరి చికిత్స పొందిన తరువాత ప్రేమ వ్యవహారంని పక్కన పెట్టింది. అయితే మనసులో బాగా అదే విషయం లాగుతూ ఉండటంతో మానసిక క్షోభతో లావయ్యింది. లావు తగ్గి మళ్లీ సినిమాలపై దృష్టి సారించాలని భావించి ఫారిన్ లో లావు తగ్గించుకునే క్రమంలో చనిపోయింది.కట్ చేస్తే ఇప్పుడు ఆర్తి అగర్వాల్ బయోపిక్ తెరకెక్కించే పనిలో పడ్డారు. ఆర్తి అగర్వాల్ బయోపిక్ అంటే మొత్తం ఈ తతంగమంతా సినిమాలో ఉండాల్సిందే. ఒక సినిమాకు కావాల్సిన అన్ని అంశాలు పుష్కలంగా ఉన్న జీవితం ఆర్తి అగర్వాల్ ది అనే చెప్పాలి.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి