బీహార్ ఎన్నికల షెడ్యూల్ విడుదల

0
39
bihar assembly elections

టాలీవుడ్ మూవీ న్యూస్, బీహార్- బీహార్ అసెంబ్లీకి నవంబర్ లో పదవీకాలం ముగియనుండటంతో కేంద్ర ఎన్నికల సంఘం పచ్చజెండా ఊపింది. ఈరోజు సమావేశమైన కేంద్ర ఎన్నికల సంఘం బీహార్ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. బీహార్ అసెంబ్లీకి మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల కమీషనర్ సునీల్ అరోరా వెల్లడించారు. అక్టోబర్ 28 న తొలివిడత పోలింగ్ , నవంబర్ 3 న రెండో విడత , మూడో విడత పోలింగ్ నవంబర్ 7 న జరుగనుంది. ఇక ఎన్నికల ఫలితాలను నవంబర్ 10 న వెల్లడించనున్నారు.

243 అసెంబ్లీ స్థానాలున్న బీహార్ లో భారతీయ జనతా పార్టీ – జేడీయు కలిసి పోటీ చేయనున్నాయి. అలాగే కాంగ్రెస్ ఆర్జేడీతో కలిసి పోటీ చేయనుంది. ఎల్జేపీ ఎన్డీఏ మిత్రపక్షంగా కొనసాగుతోంది కాబట్టి బీజేపీ – జేడీయు – ఎల్జేపీ కలిసి పోటీ చేయనున్నాయి.  నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయు బీహార్ లో బలంగానే ఉంది అలాగే భారతీయ జనతా పార్టీ కూడా రోజు రోజుకి తన బలాన్ని పెంచుకుంటోంది. ఇక ఒకప్పుడు బలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ మెల్లి మెల్లిగా తన ప్రభావాన్ని కోల్పోతుంది. అలాగే లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ కూడా బలహీనంగా తయారయ్యింది.

అయితే నితీష్ కుమార్ బీహార్ ముఖ్యమంత్రిగా మూడోసారి కొనసాగుతున్నాడు. ఇంతకుముందు 2000 సంవత్సరంలో కొన్ని రోజులు బీహార్ ముఖ్యమంత్రిగా పనిచేసాడు.  ఇక వరుసగా రెండోసారి కూడా ముఖ్యమంత్రి అయ్యాడు. 2014 నుండి వరుసగా ముఖ్యమంత్రి హోదాలో పనిచేస్తున్నాడు నితీష్ కుమార్. అవినీతి మచ్చ లేని నాయకుడు కావడం , నితీష్ కు సరైన పోటీ ఇవ్వగలిగే నాయకుడు కూడా లేకపోవడంతో ఈసారి కూడా బీజేపీ అండతో నితీష్ గద్దెనెక్కడం ఖాయమని భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. బీహార్ ఎన్నికలతో పాటుగా దేశ వ్యాప్తంగా 15 రాష్ట్రాలలోని 64 అసెంబ్లీ స్థానాలకు కూడా ఎన్నికలు జరుగనున్నాయి. 

మునుపటి వ్యాసంఎస్పీ బాలు కన్నుమూత
తదుపరి ఆర్టికల్రాజమౌళిని రిక్వెస్ట్ చేసిన చిరంజీవి
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి