నాని సినిమాకు ఓటిటిలో భారీ ఆఫర్

0
50
nani

నాని , సుధీర్ బాబు , నివేదా థామస్ తదితరులు నటించిన ” వి ” చిత్రం ఓటిటిలో విడుదల కానుంది. ఈ సినిమాకు భారీ ఆఫర్ రావడంతో దిల్ రాజు ఇందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. నాని సినిమాకు ఏకంగా 35 కోట్ల ఆఫర్ దక్కిందట దాంతో ఇది మంచి బేరం కాబట్టి ఒప్పుకోక తప్పలేదు అని తెలుస్తోంది. ఇక ఈ సినిమా సెప్టెంబర్ లో విడుదల ఓటిటిలో స్ట్రీమింగ్ కి రానుంది. విభిన్న చిత్రాల దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కింది ఈ వి చిత్రం. నాని నెగెటివ్ క్యారెక్టర్ పోషించిన ఈ చిత్రంలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా సుధీర్ బాబు నటించాడు.

ఇక నివేదా థామస్ కీలక పాత్ర పోషించింది. ఇప్పటికే ఈ సినిమా పాటలు జనాదరణ పొందాయి. అలాగే టీజర్ , ట్రైలర్ లతో వి సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అసలు ఈ సినిమా ఏప్రిల్ నెలలో విడుదల కావాల్సి ఉంది కానీ కరోనా వల్ల మార్చి నెలాఖరునే లాక్ డౌన్ విధించడంతో రిలీజ్ ఆగిపోయింది. ఇంకా కరోనా తగ్గలేదు , వచ్చే నెలలో కానీ అక్టోబర్ లో కానీ థియేటర్ లు ఓపెన్ చేసినా జనాలు థియేటర్ లకు పెద్దగా వస్తారన్న నమ్మకం లేదు అందుకే ఓటిటిలో విడుదల చేయడానికి అంగీకరించాడట దిల్ రాజు. మంచి ఆఫర్ కూడా దక్కింది కాబట్టి ఒకే అన్నాడు కానీ దిల్ రాజు ఒక నిర్మాత మాత్రమే కాకుండా డిస్ట్రిబ్యూటర్ , అలాగే ఎగ్జిబ్యూటర్ కూడా దాంతో థియేటర్ లోనే విడుదల చేయాలి అని ఇన్ని రోజులుగా అనుకున్నాడు కానీ కరోనా ప్రభావం తగ్గలేదు కాబట్టి ఓటిటికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.

మునుపటి వ్యాసంరాజమౌళికి నెగెటివ్ మరో దర్శకుడికి పాజిటివ్
తదుపరి ఆర్టికల్పవన్ కళ్యాణ్ కొత్త సినిమా సురేందర్ రెడ్డితో
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి