బిగ్ బాస్ ఆఫర్ ని ఎందుకు రిజెక్ట్ చేసాడో తెలుసా

0
60
karthikeya

యంగ్ హీరో కార్తికేయ బిగ్ బాస్ ఆఫర్ ని ఏమాత్రం ఆలోచించకుండా రిజెక్ట్ చేసాడట. బిగ్ బాస్ తెలుగులో కూడా అత్యధికంగా రేటింగ్ సాధించిన విషయం తెలిసిందే. మొదట ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించగా , ఆ తర్వాత నాని , నాగార్జున లు వరుసగా హోస్ట్ గా వ్యవహరించారు. దాంతో మూడు బిగ్ బాస్ షోలు కూడా సక్సెస్ అయ్యాయి దాంతో ఇప్పుడు నాలుగో సీజన్ ని రూపొందించాలని భావిస్తున్నారు. ఈ నాలుగో సీజన్ లో కొంతమంది హాట్ భామలతో పాటుగా యంగ్ హీరో కార్తికేయ ని కూడా తీసుకోవాలని భావించి అడిగారట.

అయితే కార్తికేయ మాత్రం మొహమాటం లేకుండా తిరస్కరించాడట. ఎందుకంటే బిగ్ బాస్ 4 లో పాల్గొంటే తప్పకుండా 100 రోజులు బ్లాక్ అవుతుంది అలాగే ఆ రోజులో ఇతర విషయాలు తెలుసుకోవడం కష్టమే. అంతేనా కారోనా భయం కూడా ఉంది. ఒకవైపు కారోనా విలయతాండవం చేస్తోంది. ఇలాంటి సమయంలో బిగ్ బాస్ హౌజ్ లో అందరితో కలిసి ఉండటం కష్టం …… సోషల్ డిస్టెంసింగ్ కూడా కష్టమే అందుకే బిగ్ బాస్ అంటే గౌరవం , క్రేజ్ ఉన్నప్పటికీ నేను మాత్రం పాల్గొనను అని చెప్పాడట కార్తికేయ. ఆర్ ఎక్స్ 100 చిత్రంతో సంచలన విజయం అందుకున్న ఈ హీరో ఆ తర్వాత ఆ స్థాయి విజయాన్ని అందుకోలేక పోయాడు.

మునుపటి వ్యాసంచిలుకూరు బాలాజీ ఆలయంలో వింత దేనికి సంకేతం
తదుపరి ఆర్టికల్హీరోయిన్ గా మారుతున్న వల్లంకి పిట్ట
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి