కేసీఆర్ సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేసిన భట్టి

0
43
bhattivikramarka kcr

టాలీవుడ్ మూవీ న్యూస్,హైద్రాబాద్తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసాడు సీఎల్పీ నాయకుడు భట్టి  విక్రమార్క. హైదరాబాద్ పరిధిలో ఒక లక్ష ఇళ్ల నిర్మాణం జరుగుతోందని దాన్ని చూపిస్తామని అసెంబ్లీ లో ప్రకటించి తీరా మమ్మల్ని తీసుకెళ్లి చూపించింది కేవలం 3400 ఇల్లు మాత్రమే! మహేశ్వరంలో కడుతున్న ఇల్లు ఇప్పటివి కావు 2016 నాటివి వాటిని కూడా హైదరాబాద్ లెక్కలో చూపిస్తున్నారు అంతేకాదు ఇల్లు చూపిస్తామని తీసుకెళ్లిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ , మేయర్ బొంతు రామ్మోహన్ లు మమ్మల్ని మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయారని లక్ష డబుల్ బెడ్ రూంలు సిద్దమయ్యాయని ప్రజలను మోసం చేస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు భట్టి .

కేసీఆర్ , కేటీఆర్ , తలసాని మాట్లాడితే డబుల్ బెడ్ రూమ్ లు అంటూ గ్రేటర్ హైదరాబాద్ ప్రజలను మోసం చేస్తున్నారని , గత ఎన్నికల కోసం ఈ డ్రామాలు ఆడారని , ఇప్పుడు మళ్ళీ గ్రేటర్ హైదరాబాద్ లో ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి మళ్ళీ ఈ డ్రామాకు తెరలేపారని ఘాటు విమర్శలు చేసారు. గ్రేటర్ హైదరాబాద్ లోని 24 నియోజకవర్గాల్లో 96 వేల ఇళ్లను చూపిస్తామని చెప్పి కేవలం 3400 ఇల్లు మాత్రమే చూపించారని , మమ్మల్ని వదిలేసి వెళ్లడంతో మళ్ళీ వస్తారేమో అని 40 నిమిషాల పాటు ఎదురు చూశామని కానీ తలసాని కానీ మేయర్ కానీ మళ్ళీ రాలేదని దుయ్యబట్టారు.

నాలుగేళ్లుగా డబుల్ బెడ్ రూమ్ ఇల్లు అంటూ ప్రజలను మోసం చేస్తున్నారని , అయితే ఇకపై ఇలాంటి మోసాలను గట్టిగా ఎండగడతామని రాబోయే ఎన్నికలలో  మళ్ళీ గెలవడానికి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు అంటూ నాటకం ఆడుతున్నారని అందుకే ఇంటింటికి వెళ్లి టీఆర్ఎస్ పార్టీ చేసిన మోసాలను బయటపెడతామని హెచ్చరించాడు భట్టి విక్రమార్క.

మునుపటి వ్యాసంసమంత పాత్రని తన్నుకుపోయిన ఐశ్వర్య
తదుపరి ఆర్టికల్మెగా మేనల్లుడు సంక్రాంతి వరకు ఎదురు చూడాల్సిందే
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి