భార్యకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పిన చరణ్

0
44
TMN logo
TMN logo

జులై 20 న ఉపాసన పుట్టినరోజు కావడంతో ఆ సందర్భంగా భార్యకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశాడు హీరో రాంచరణ్. నువ్ చేసే పనులతో మరింత మంచి పేరు తెచ్చుకుంటావని ట్వీట్ చేసాడు చరణ్. ఉపాసన అపోలో హాస్పిటల్ ని మరింత ఉన్నతగా తీర్చిదిద్దే పనిలో పడింది. ఒకవైపు హాస్పిటల్ పనులు నిర్వర్తిస్తూనే మరోవైపు సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతోంది ఉపాసన.

ఉపాసన కు చరణ్ తో పాటుగా రానా , సానియా మీర్జా , రకుల్ ప్రీత్ సింగ్ తదితరులు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. చరణ్ – ఉపాసన ల పెళ్లి జరిగి ఎనిమిదేళ్లు అయ్యింది. దాంతో వారసుడు కావాలని ఆశిస్తున్నారు మెగా అభిమానులు. చరణ్ తాజాగా ఆర్ ఆర్ ఆర్ చిత్రంలో నటిస్తున్నాడు. అయితే ఆ సినిమా 80 శాతం షూటింగ్ మాత్రమే పూర్తి అయ్యింది. మిగతా షూటింగ్ పూర్తి కావాలంటే కారోనా తగ్గాలి. అప్పటి వరకు ఇంట్లోనే ఉండటం మంచిదని అంటున్నారు. స్టే హోం స్టే సేఫ్ అంటున్నారు పలువురు సినీ ప్రముఖులు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి