పెళ్ళైనా శృంగార సన్నివేశాల్లో నటిస్తానంటున్న భామ

0
23

పెళ్ళైనా శృంగార సన్నివేశాల్లో నటిస్తానని సంచలన వ్యాఖ్యలు చేసింది కన్నడ భామ శ్రద్దా శ్రీనాథ్. నాని హీరోగా నటించిన జెర్సీ చిత్రంలో హీరోయిన్ గా నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన భామ శ్రద్దా శ్రీనాథ్. లాక్ డౌన్ కారణంగా ఇంట్లోనే ఉంటున్న ఈ భామని ఓ నిర్మాత మీ ఫ్రెండ్ పెళ్లి చేసుకుంటోంది కదా! పెళ్లి అయ్యాక సినిమాల్లో నటిస్తుందా ? అని అడిగాడట దాంతో అవాక్కయ్యిందట. ఇదే ప్రశ్న మీరు హీరోలను వేయగలరా ? అని ప్రశ్నిస్తోంది. హీరోలకు ఒక న్యాయం , హీరోయిన్ లకు ఒక న్యాయమా ? పెళ్లి అయ్యాక హీరోలు ఎలాంటి సన్నివేశాల్లో అయినా నటిస్తారు ….. శృంగార సన్నివేశాల్లో కూడా నటిస్తారు భార్య ఉన్నప్పటికీ.

కానీ అలాంటి వాళ్ళని మాత్రం ప్రశ్నించరు కానీ హీరోయిన్ లకి పెళ్లి కాగానే మళ్లీ సినిమాల్లో నటిస్తారా ? శృంగార సన్నివేశాల సంగతి ఏంటి ? అని అడుగుతున్నారు. నేను మాత్రం పెళ్లి అయ్యాక కూడా నటిస్తాను. అలాగే శృంగార సన్నివేశాల్లో కూడా నటిస్తాను అందులో తప్పేముంది. హీరోలు చేస్తే తప్పు లేదు కానీ మేము చేస్తే తప్పా ? అని నిలదీస్తోంది శ్రద్దా శ్రీనాథ్. అంతేకాదు నెటిజన్లను కూడా అడుగుతోంది ఇది న్యాయమేనా ? సమాధానం చెప్పండని. ఈ విషయంలో శ్రద్దా శ్రీనాథ్ కు సోషల్ మీడియాలో బాగానే మద్దతు లభిస్తోంది. మీ అభిప్రాయంలో ఎలాంటి తప్పు లేదు అంటూ సమర్ధిస్తున్నారు నెటిజన్లు.

మునుపటి వ్యాసంపవన్ కళ్యాణ్ సినిమాకు ఎన్టీఆర్ టైటిల్స్ పెట్టనున్నారా ?
తదుపరి ఆర్టికల్ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లోకి రానున్న ఎస్ ఎస్ రాజమౌళి
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి