మంగోలియాలో డబ్ అవుతున్న బాహుబలి

0
39
BHAUBALI IN MAGOLIA

TMN-HYD- బాహుబలి ది బిగినింగ్ విడుదలై 5 సంవత్సరాలు అవుతున్నా ఇంకా ఆ చిత్రం పలు దేశాల్లో పలు ప్రాంతాల్లో ఇంకా విడుదల అవుతూనే ఉంది. తాజాగా మంగోలియా దేశంలో బాహుబలి ది బిగినింగ్ డబ్ అయ్యింది. రేపు అనగా ఆగస్ట్ 16 న అక్కడి ఛానల్ లో ప్రసారం కానుంది. ఇప్పటికే డబ్బింగ్ కార్యక్రమాలు అన్ని పూర్తయ్యాయి. ఇక రేపు మంగోలియా లో బాహుబలి ప్రసారం అవనుంది. ఇటీవలే రష్యాలో కూడా ప్రసారమైంది బాహుబలి చిత్రం. రష్యాలో ప్రసారమైన మొట్టమొదటి ఇండియన్ చిత్రంగా బాహుబలి అరుదైన ఘనత సాధించింది.

తాజాగా ప్రభాస్ రాధే శ్యామ్ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తోంది. ఇక తాజాగా వినబడుతున్న కథనం ప్రకారం పూజా హెగ్డే ఇందులో ద్విపాత్రాభినయం పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో పూజా హెగ్డే రెండు పాత్రల్లో కనిపించనుందా లేక రెండు వెరీయేషన్ లలో నటించనుందా అన్నది తెలియాల్సి ఉంది. 1960- 70 మధ్య కాలంలో జరిగే పీరియాడికల్ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రాధే శ్యామ్ చిత్రం రూపొందుతోంది. మొత్తానికి బాహుబలి తో ప్రభాస్ ఖ్యాతి ఖండాలను దాటిపోతోంది.

మునుపటి వ్యాసంఅప్సరా రాణి అందాల విందు థ్రిల్లర్
తదుపరి ఆర్టికల్మరో నటుడి ఎంగేజ్ మెంట్
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి