బెదిరింపులతోనే సహజీవనం చేస్తున్నానని భయపడేది లేదంటున్నాడు

0
58
TMN logo
TMN logo

తనకు ఈమధ్య పెద్ద ఎత్తున బెదిరింపులు వస్తున్నాయని , అయినా భయపడేది లేదంటున్నాడు వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ. అంతేకాదు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తో బస్తీమే సవాల్ అని కూడా ఛాలెంజ్ చేస్తున్నాడు వర్మ. పవర్ స్టార్ అనే సినిమా తీస్తూ సంచలనం సృష్టిస్తున్నాడు వర్మ. పవన్ కళ్యాణ్ ఇమేజ్ ని డ్యామేజ్ చేసేలా ఉంది పవర్ స్టార్ సినిమా అందుకే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వర్మపై చాలా ఆగ్రహంగా ఉన్నారు. ఇక ఈనెల 25 న ఉదయం 11 గంటలకు పవర్ స్టార్ సినిమాని తన ఆర్జీవి వరల్డ్ థియేటర్ లో విడుదల చేస్తున్నట్లు ప్రకటించాడు. ఈరోజు ట్రైలర్ కూడా విడుదల అయ్యింది. దాంతో మరింత కోపంగా ఉన్నారు పవన్ ఫ్యాన్స్.ఆ కోపంలో వర్మ ని బెదిరిస్తున్నారట. తనకు బెదిరింపులు కొత్త కాదని, బెదిరింపులతోనే సహజీవనం చేస్తున్నానని మరోసారి ట్వీట్ చేసి ఇంకా రెచ్చగొడుతున్నాడు వర్మ. ఇక వర్మపై సెటైర్ వేస్తూ ఒక్క సినిమా కాదు దాదాపు మూడు , నాలుగు సినిమాలు రెడీ అవుతున్నాయి. అందులో పరాన్నజీవి అనే సినిమా కూడా ఈనెల 25 నే విడుదల కానుంది. ఇక సమయం కూడా సేమ్ టు సేమ్ 11 గంటలకే. ఈ వ్యవహారం చూస్తే పెద్ద గొడవ జరిగేలాగే కనబడుతోంది. ఏమౌతుందో ఈనెల 25 న తేలనుంది.

మునుపటి వ్యాసంనిరాడంబరంగా జరిగిన ఎంగేజ్మెంట్
తదుపరి ఆర్టికల్అంబటి రాంబాబు కు కరోనా వై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కలవరం మొదలైంది
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి