బాలు ప్రాణం తీసిన సంగీత కచేరి

0
22
sp.balu

టాలీవుడ్ మూవీ న్యూస్,హైద్రాబాద్ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ప్రాణం తీసింది ఓ సంగీత కచేరి. అది కూడా ఇక్కడ హైదరాబాద్ లో నిర్వహించిన సంగీత కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన బాలు తిరిగి వెళ్లేప్పుడు కరోనాతో వెళ్లారు ఇంకేముంది ఆ కరోనా మహమ్మారి తో ఆసుపత్రిలో పోరాడుతూ కరోనాని జయించాడు కానీ ఆరోగ్యం విషమించి చివరకు తనువు చాలించాడు. ఓ మంచి కార్యక్రమం కోసం హైదరాబాద్ వచ్చిన బాలు ఇక తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయాడు. అందరినీ తీవ్ర దుఃఖసాగరంలో ముంచేసి తాను మాత్రం ఒక్కడై పోయాడు.

అసలే కరోనా మహమ్మారి గత 7 నెలలుగా విలయతాండవం చేస్తున్న సంగతి తెలిసిందే. కరోనా భయంతో ఎవరూ షూటింగ్ లు చేయడం లేదు. అలాగే ఇతర కార్యక్రమాలు కూడా జరగడం లేదు. కానీ ఇటీవల ఓ ఛానల్ లో సంగీత కార్యక్రమం చేపట్టారు అది కూడా పేద కళాకారులను ఆదుకోవాలనే సంకల్పంతో. ఇదే విషయాన్ని బాలు కి చెప్పి రావాలని కోరగా అందుకు అభ్యంతరం ఏముంది మంచి కార్యక్రమం కదా అంటూ తన ఇంట్లో వాళ్ళు అభ్యంతరం చెబుతున్నా వినకుండా హైదరాబాద్ వచ్చి మూడు రోజుల పాటు ఆ కార్యక్రమంలో పాల్గొన్నాడు బాలు.

హైదరాబాద్ లో మూడు రోజుల పాటు ఉన్న బాలు తిరిగి చెన్నై వెళ్ళాడు అయితే ఇంటికి వెళ్ళగానే కాస్త అనారోగ్యం అనిపించడంతో కరోనా టెస్ట్ చేయించుకున్నాడు ఇంకేముంది పాజిటివ్ అని తేలింది. దాంతో కొన్ని రోజులు ఇంట్లోనే చికిత్స పొందాడు కానీ శ్వాసకోశ బాధతో ఆగస్టు 5 న చెన్నై లోని ఎంజిఎం ఆసుపత్రిలో చేరాడు. ఐసియు లోకి వెళ్లే ముందు మళ్ళీ తిరిగి వస్తాను అని చెప్పాడు కూడా కానీ దాదాపు 50 రోజుల పాటు ఎక్మో పై చికిత్స పొందినా ఫలితం లేకపోయింది. ఓ మంచి కార్యక్రమం కోసం బాలు వస్తే కరోనా బాలుని మింగేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బాలు అభిమానులను శోక సంద్రంలో ముంచెత్తి గగనమైపోయాడు. 

మునుపటి వ్యాసంకవిత గెలుపుకు మార్గం సుగమం
తదుపరి ఆర్టికల్దిశ ఎన్ కౌంటర్ ట్రైలర్ విడుదల
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి