కరోనా ఆసుపత్రికి 55 లక్షలు ఇస్తున్న బాలయ్య

0
102
bala krishna charity to carona hospital

కరోనా ఆసుపత్రికి 55 లక్షలు ఇస్తున్న బాలయ్య

నటసింహం నందమూరి బాలకృష్ణ హిందూపురం లోని కరోనా ఆసుపత్రికి 55 లక్షల విలువ చేసే వస్తువులను విరాళంగా ఇస్తున్నారు. బాలకృష్ణ హిందూపురం శాసన సభ్యులు అన్న విషయం తెలిసిందే. కరోనాతో బాధపడుతున్న హిందూపురం ప్రజలతో పాటుగా మిగతా చుట్టుపక్కల ప్రాంత ప్రజల కోసం 55 లక్షల విలువైన కరోనా కోసం వాడే సామాగ్రిని ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఈనెల 28 న హిందూపురం కరోనా ఆసుపత్రికి ఇవ్వనున్నారు బాలయ్య. ఆమేరకు ప్రకటన విడుదల చేసారు. కరోనా ఆసుపత్రిలో కరోనా కిట్లు లేక ఇబ్బంది పడుతున్నారు ఆసుపత్రి సిబ్బంది అందుకే బాలయ్య ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలలో కరోనా విలయతాండవం చేస్తుండటంతో ఇబ్బంది పడుతున్న ప్రజల కోసం ఆంధ్రప్రదేశ్ కు 50 లక్షలు తెలంగాణకు 50 లక్షలు అలాగే సినిమా కార్మికుల కోసం మరో 20 లక్షలు మొత్తంగా ఒక కోటి 20 లక్షలను అందజేశారు బాలయ్య. అలాగే సినిమా రంగంలోని పలువురు ప్రముఖులకు కరోనా రాకుండా ముందస్తు చర్యల్లో భాగంగా హోమియోపతి మందులను కూడా అందించారు బాలయ్య. అలాగే బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా కూడా పలు కార్యక్రమాలు చేపడుతున్నారు.

తాజాగా బాలయ్య బోయపాటి శ్రీను దర్శకత్వంలో మరో మాస్ చిత్రం చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా కొంత షూటింగ్ అయ్యింది. అయితే ఎక్కువ భాగం కాశీలో చిత్రీకరించాల్సి ఉండే కానీ కరోనా ఎఫెక్ట్ తో తెలుగు రాష్ట్రాలను దాటేసి వెళ్లాలంటే భయపడుతున్నారు సినిమావాళ్ళు. అందుకే బ్యాక్ డ్రాప్ మార్చారట. బయట కాకుండా ఇక్కడే రెండు తెలుగు రాష్ట్రాలలో బాలయ్య  సినిమా షూటింగ్ ఉండేలా ప్లాన్ చేశారట దర్శకుడు బోయపాటి శ్రీను. అన్నీ సవ్యంగా సాగితే అక్టోబర్ నుండి బాలయ్య – బోయపాటి సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి