కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపిన బాలయ్య

0
43
bala thanks to cmkcr sir

టాలీవుడ్ మూవీ న్యూస్,హైద్రాబాద్నటసింహం నందమూరి బాలకృష్ణ తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు ధన్యవాదాలు తెలియజేసాడు. బాలయ్య కేసీఆర్ కు ఎందుకు ధన్యవాదాలు తెలియజేసాడో తెలుసా …….. స్వర్గీయ ఎన్టీఆర్ జీవిత కథని తెలంగాణ లోని పడవ తరగతి సాంఘిక శాస్త్రంలో పాఠ్యాంశంగా చేర్చడమే. తన తండ్రి తెలుగుజాతి ఔన్నత్యానికి పాడుపడిన వ్యక్తి అని అలాంటి మహనీయుడి చరిత్రని పాఠ్యాంశంగా చేర్చిన కేసీఆర్ కు తెలంగాణ ప్రభుత్వానికి కృతఙ్ఞతలు అంటూ పేర్కొన్నాడు.

ఎన్టీఆర్ రాకముందు వరకు కూడా తెలుగు వాళ్ళని మదరాసీలుగా పిలవబడే వాళ్ళు. అయితే ఎప్పుడైతే ఎన్టీఆర్ తెలుగువాడి పౌరుషాన్ని ప్రపంచానికి చాటి చెప్పాడో అప్పటి నుండి తెలుగువాళ్ల ఖ్యాతి ప్రపంచ వ్యాపితం అయ్యింది. సినిమారంగంలో రారాజుగా వెలుగొందిన ఎన్టీఆర్ ఆ తర్వాత రాజకీయ రంగంలో కూడా అడుగుపెట్టి తెలుగుదేశం పార్టీని స్థాపించి , పార్టీని స్థాపించిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చేలా చేసి కాంగ్రెస్ పార్టీని కూకటి వేళ్ళతో పెకిలించి గిన్నిస్ బుక్ లోకి ఎక్కాడు ఎన్టీఆర్.

రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా జాతీయ రాజకీయాల్లోకి కూడా అడుగుపెట్టాడు ఎన్టీఆర్. కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా నేషనల్ ఫ్రంట్ అనే ఉమ్మడి రాజకీయ వేదిక ప్రారంభించి కాంగ్రెస్ పార్టీని కేంద్రంలో కూడా అధికారంలోకి రాకుండా చేసాడు ఎన్టీఆర్. నేషనల్ ఫ్రంట్ చైర్మన్ గా కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలను అన్నింటిని ఏకం చేసిన వ్యక్తి , శక్తి ఎన్టీఆర్. అయితే 1995 లో ఘోర అవమానం పొందుతూ అధికారం నుండి దిగిపోవాల్సి వచ్చింది. చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యాడు ఆ తర్వాత కొద్దిరోజులకే గుండెపోటుతో మరణించాడు ఎన్టీఆర్.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి