నటుడిగా 46 ఏళ్ళు పూర్తిచేసుకున్న బాలకృష్ణ

0
78
bala krishna compleated 46 years cinema industry

నటుడిగా 46 ఏళ్ళు పూర్తిచేసుకున్న బాలకృష్ణ

నటసింహం నందమూరి బాలకృష్ణ నటుడిగా 46 ఏళ్ళు పూర్తి చేసుకున్నాడు ఈరోజుకి. సరిగ్గా 46 సంవత్సరాల క్రితం బాలయ్య బాల నటుడిగా నటించిన మొట్ట మొదటి చిత్రం తాతమ్మ కల. ఎన్టీఆర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ తన ఎన్ ఏ టి బ్యానర్ పై నిర్మించడం విశేషం. మహానటి భానుమతి రామకృష్ణ కీలక పాత్ర పోషించిన ఈ చిత్రంలో ఎన్టీఆర్ , నందమూరి హరికృష్ణ , సారథి, కాంచన , రోజా రమణి తదితరులు నటించిన ఈ చిత్రంతో నందమూరి బాలకృష్ణ నటుడిగా పరిచయం అయ్యాడు. తాతమ్మ కల ని నెరవేర్చే మనవడిగా బాలయ్య నటించాడు. పైగా గొప్ప నటి అయిన భానుమతి రామకృష్ణ తో కలిసి నటించే అదృష్టం మొదటి సినిమాకే బాలయ్యకు దక్కింది.

అలాగే తండ్రి ఎన్టీఆర్ తో అన్నయ్య నందమూరి హరికృష్ణ తో కలిసి నటించిన మొదటి సినిమా ఈ తాతమ్మ కల. సందేశాత్మక చిత్రంగా తెరకెక్కిన తాతమ్మ కల మంచి పేరు తెచ్చుకుంది. ఇక ఆ తర్వాత బాలయ్య వెనుతిరిగి చూడాల్సిన అవసరం లేకుండా పోయింది. 1974 లో వచ్చిన తాతమ్మ కల తో నటుడిగా ఎంట్రీ ఇచ్చిన బాలయ్య అప్పుడే 46 ఏళ్ళు పూర్తి చేసుకున్నాడు నటుడిగా. దాంతో ఆ సందర్భంగా బాలయ్య నటించిన అన్ని సినిమాలను కలిపి ఓ కామన్ డిపి రూపొందించారు. అది ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

తాజాగా బాలయ్య బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఇంతకుముందు ఈ ఇద్దరి కాంబినేషన్లో సింహా , లెజెండ్ చిత్రాలు రాగా ఆ రెండు కూడా బ్లాక్ బస్టర్ లుగా నిలిచాయి. దాంతో ఇప్పుడు మూడో చిత్రంగా వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాలో బాలకృష్ణ సరసన కొత్త హీరోయిన్ ని తీసుకుంటుండగా కీలక పాత్రలో ఒకప్పటి హాట్ భామ సిమ్రాన్ ని తీసుకున్నట్లు తెలుస్తోంది. బాలయ్య – సిమ్రాన్ ల కాంబినేషన్లో పలు సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి. దాంతో ఈ ఇద్దరిదీ బ్లాక్ బస్టర్ కాంబినేషన్ అయ్యింది. సమర సింహా రెడ్డి , నరసింహా నాయుడు , సీమసింహం తదితర చిత్రాలలో జంటగా నటించారు బాలయ్య , సిమ్రాన్ .

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి