జయప్రకాష్ రెడ్డి కుటుంబానికి బాలకృష్ణ10 లక్షల సాయం

0
48
balakrishna donate 10 lakhs tojaya prakash reddy

టాలీవుడ్ మూవీ న్యూస్,హైద్రాబాద్- విలన్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన జయప్రకాశ్ రెడ్డి మరణంతో తీవ్ర విషాదంలో మునిగిన ఆ కుటుంబానికి హీరో నందమూరి బాలకృష్ణ 10 లక్షల ఆర్ధిక సహాయం ప్రకటించాడు. అంతేకాదు ఈ మొత్తాన్ని తక్షణమే ఆ కుటుంబానికి అందేలా చేసాడు బాలయ్య. ఈరోజుల్లో పెళ్లి మాత్రమే కాదు చావు కూడా అంతకంటే ఎక్కువే ఖర్చులు అవుతాయి కాబట్టి జేపీ అంత్యక్రియలు అంగరంగ వైభవంగా జరిగేలా చేయాలనీ ఆదేశాలు జారీ చేసాడట బాలయ్య.

నందమూరి బాలకృష్ణ – జయప్రకాశ్ రెడ్డి ల కాంబినేషన్ లో దాదాపు 30 చిత్రాల వరకు వచ్చాయి ఇప్పటి వరకు. ముఖ్యంగా నరసింహనాయుడు , సమరసింహా రెడ్డి , చెన్నకేశవ రెడ్డి , లారీ డ్రైవర్ , పల్నాటి బ్రహ్మనాయుడు తదితర చిత్రాల్లో పోటా పోటీగా సన్నివేశాలు ఉంటాయి ఈ ఇద్దరి మధ్య. రాయలసీమ ఫ్యాక్షన్ చిత్రాల హీరోగా బాలయ్యకు అరుదైన రికార్డ్ ఉంది. అలాగే రాయలసీమ ఫ్యాక్షనిస్ట్ పాత్రలో , యాసలో భాషల్లో అంతకంటే ఎక్కువే రికార్డ్ ఉంది జయప్రకాశ్ రెడ్డికి అందుకే ఈ ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉండేది. ఆ అనుబంధంతోనే బాలయ్య 10 లక్షల ఆర్ధిక సాయం అందించాడు.

జయప్రకాశ్ రెడ్డి సినిమాల్లో మాత్రమే కాకుండా నాటకరంగంలో కూడా పలు పాత్రలు చేసేవాడు. నాటకరంగాన్ని బ్రతికించాలని ఆశగా ఉండేది . అందుకే ప్రభుత్వాలతో మాట్లాడటానికి చాలా ప్రయత్నాలు చేసాడు కానీ కుదరలేదు పాపం. అలాగే ఇటీవల టాలీవుడ్ లో పలువురు హీరోలను , ఇతర నటులను కూడా ఏపీ ముఖ్యమంత్రి జగన్ ని కలవాలని , నాటకరంగాన్ని ప్రోత్సహించేలా తగు చర్యలు చేపట్టాల్సిందిగా కోరాలని అనుకున్నాడట పాపం . కానీ ఆ కోరిక తీరకుండానే తనువు చాలించాడు. 

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి