బాబాయ్ పై సంచలన ఆరోపణలు చేసిన ఊర్మిళ

0
51

బాబాయ్ అశోక్ గజపతిరాజు పై సంచలన ఆరోపణలు చేసింది ఆనంద్ గజపతిరాజు కూతురు ఊర్మిళ ఆనంద్ గజపతి రాజు. మా నాన్న ఆనంద్ గజపతిరాజు మా తాత గారి ఆశయాలను కొనసాగిస్తూ మాన్సాస్ ట్రస్ట్ ని నిర్వహిస్తూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండేవాడిని , ప్రజా సమస్యలు పై స్పందిస్తూ వాటిని పరిష్కరించేవాడని కానీ మా బాబాయ్ మాత్రం మా తాత , నాన్న గార్ల ఆశయాలను తుంగలో తొక్కాడని, మమ్మల్ని మాన్సాస్ ట్రస్ట్ కు దూరం చేయడమే కాకుండా సింహాచలం దేవస్థానం ని కూడా తన ఆధీనంలో పెట్టుకొని మమ్మల్ని కనీసం ఆహ్వానించడం కూడా మానేసారని ఇదంతా అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం అండతో కొనసాగించాడని బాబాయ్ అశోక్ గజపతిరాజు పై తీవ్ర వ్యాఖ్యలు చేస్తోంది ఆనంద్ గజపతిరాజు కూతురు ఊర్మిళ.

మెడికల్ కాలేజ్ నిర్మించాలని , ప్రజలకు మరిన్ని మెరుగైన సేవలు అందించాలని నాన్నగారు ఎంతగానో తాపత్రయపడ్డారు. కానీ ఆయన చనిపోవడంతో బాబాయ్ దొడ్డిదారిన ట్రస్ట్ ని చేజిక్కించుకొని మమ్మల్ని ట్రస్ట్ కు దూరం పెట్టారని, అవకాశం లభిస్తే ఇప్పుడు రాజకీయాలలోకి రావాలని ఉందని కానీ ఆ అవకాశం ఉంటుందా ? ఏపీ సీఎం జగన్ ఆ అవకాశం కల్పిస్తారా ? అన్నది చూడాలని అంటోంది ఊర్మిళ. తెలుగుదేశం హయాంలో జీవో తెచ్చి అశోక్ గజపతిరాజు ని చైర్మన్ ని చేసినట్లుగా జగన్ ప్రభుత్వం మాన్సాస్ ట్రస్ట్ కు ఇప్పుడు సంచయితని చైర్మన్ గా చేసింది. దాంతో టిట్ ఫర్ టాట్ అన్నట్లుగా మారింది.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి