బండ్ల గణేష్ పరిస్థితి దారుణంగా ఉందట !

0
40
Baṇḍla Ganesh's condition is worse!

నటుడు , నిర్మాత బండ్ల గణేష్ పరిస్థితి దారుణంగా ఉందని వాపోయాడు. తన పరిస్థితి దారుణంగా మారడానికి కారణం ఏంటో తెలుసా ….. కరోనా . అవును కరోనా ఎఫెక్ట్ బాగా పడింది బండ్ల గణేష్ మీద. బండ్ల గణేష్ నటుడిగానే కాకుండా పలు చిత్రాలను నిర్మించాడు. అయితే సినిమాల మీద సంపాదించిన సొమ్ము కంటే పౌల్ట్రీ వ్యాపారం మీదే ఎక్కువ సంపాదించాడు. కోళ్ల వ్యాపారంలో కోట్ల కొద్దీ లాభాలు గడించాడు ఇన్నాళ్ళుగా.

అయితే కరోనా ఎఫెక్ట్ తో ఒక్కసారిగా కోళ్ల వ్యాపారం దెబ్బతింది. చికెన్ తింటే కరోనా వస్తుందని పుకార్లు నమ్మి చికెన్ తినడం లేదు దాంతో పెద్ద ఎత్తున నష్టాలు వస్తున్నాయి. అందుకే నా పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి లాగా ఉందని వాపోతున్నాడు పాపం. కరోనా ఎఫెక్ట్ తో ఇంకొంత కాలం చికెన్ తినడం కష్టమే ! అంటే ఏడాది మొత్తం భారీ నష్టాలు రావడం ఖాయమని భయపడుతున్నాడు బండ్ల గణేష్.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి