రూమర్లని ఖండించిన ఆంటీ

0
58
praghathi

నేను తెలుగు బిగ్ బాస్ 4 సీజన్ లో పాల్గొంటున్నట్లు పుకార్లు షికారు చేస్తున్నాయని అయితే నేను బిగ్ బాస్ షోలో పాల్గొనడం లేదని కుండబద్దలు కొట్టింది సీనియర్ నటి ప్రగతి. త్వరలోనే తెలుగు బిగ్ బాస్ 4 సీజన్ ప్రారంభం కానుండటంతో అందులో పాల్గొనవళ్లు ఫలానా అంటూ రకరకాల పేర్లు వినబడుతున్నాయి అలాగే ప్రచారంలోకి వస్తున్నాయి. అందులో క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి పేరు కూడా వినబడింది. అయితే వాటిని ఖండించినప్పటికీ మళ్ళీ మళ్ళీ ప్రగతి పేరు వస్తుండటంతో మరోసారి ఖండించింది ప్రగతి.

నాకు బిగ్ బాస్ 4 లో పాల్గొనాలని ఆసక్తి లేదు , డబ్బు కోసం చేయాల్సిన అవసరం కూడా లేదు అంతేనా పేరు కోసం చేయాల్సిన అవసరం కూడా లేదు . నాకు డబ్బు , కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి వాటికోసం కొత్తగా వెంపర్లాడాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది ప్రగతి. తెలుగులో పలు చిత్రాల్లో అమ్మగా , అక్కగా , అత్తగా పలు పాత్రలను పోషించింది ప్రగతి. తమిళంలో కెరీర్ మొదట్లో హీరోయిన్ గా కూడా నటించింది. అయితే హీరోయిన్ గా నటిస్తున్న సమయంలో ఓ తమిళ హీరోతో ఇబ్బందులు ఎదురవ్వడంతో నటనకు స్వస్తి పలికి కొన్నాళ్ల తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారింది.

ఇక లాక్ డౌన్ పుణ్యమా అని ఖాళీ సమయం ఎక్కువగా దొరకడంతో రకరకాల పాటలకు డ్యాన్స్ చేస్తూ వీడియోలను రూపొందిస్తు వాటిని తన ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేస్తోంది. అలాగే ఎక్కువసేపు ఎక్సర్ సైజ్ చేస్తూ తన ఫిట్ నెస్ పై దృష్టిపెట్టింది. 43 ఏళ్ల వయసులో కూడా చక్కని ఫిజిక్ తో హీరోయిన్ లకు పోటీ ఇస్తోంది ప్రగతి. 

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి