రాహుల్ సిప్లిగంజ్ పై దాడి

0
28
Attack on Rahul Cipliganj

బిగ్ బాస్ 3 తెలుగు విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ పై నిన్న రాత్రి పబ్ లో దాడి జరిగింది. దాడిలో రాహుల్ కు గాయాలు అయ్యాయి కానీ దాడిచేసిన వాళ్లపై ఫిర్యాదు చేయకుండా ఆసుపత్రిలో చికిత్స తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. దాడి విషయం పోలీసులకు తెలియడంతో సుమోటాగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని పేర్కొన్నారు. సంఘటన వివరాలలోకి వెళితే ……. నిన్న రాత్రి హైదరాబాద్ గచ్చిబౌలి లోని ప్రిజం పబ్ కు తన స్నేహితులతో కలిసి వెళ్ళాడు రాహుల్.

రాహుల్ వెంట లేడీ కూడా ఉండటంతో ఆమె పట్ల అనుచితంగా ప్రవర్తించారట ఎం ఎల్ రోహిత్ రెడ్డి బంధువులు. దాంతో వాళ్లతో వాగ్వాదానికి దిగాడు రాహుల్ సిప్లిగంజ్. గొడవ పెద్దది కావడంతో ఎం ఎల్ బంధువులు రెచ్చిపోయి బీరు బాటిళ్లతో రాహుల్ పై దాడికి పాల్పడ్డారు. తలకు గాయమై తీవ్ర రక్తస్రావం కావడంతో వెంటనే సమీపంలోని ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందాడు రాహుల్. అయితే చికిత్స పొందిన అనంతరం ఇంటికి వెళ్ళిపోయాడు. సంఘటన పోలీసులకు తెలియడంతో సుమోటాగా కేసు నమోదు చేస్తామని తెలిపారు

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి