సంగీత దర్శకుడిపై దాడి

0
26
attack on music director aghasthya

టాలీవుడ్ మూవీ న్యూస్,హైద్రాబాద్తెలుగులో పలు చిత్రాలకు సంగీతం అందించిన యువ సంగీత దర్శకుడు అగస్త్య బోయలపల్లి పై దాడి జరిగింది. అయితే ఈ సంఘటన గత నెలలో జరుగగా కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సంగీత దర్శకుడు అగస్త్య తన ఇంట్లో ఉండగా చిట్టి నాగార్జున రెడ్డి , చిట్టి శ్రావ్య రెడ్డి , చిట్టి అనూష రెడ్డి లు అగస్త్య ఇంట్లోకి చొరబడి కొట్టారు. ముగ్గురు కలిసి ఒకేసారి దాడి చేయడంతో గాయాలు బాగానే అయ్యాయట. అయితే వాళ్ళ నుండి తప్పించుకొని పారిపోయాడు అగస్త్య.

ముగ్గురి నుండి తప్పించుకున్న అగస్త్య నేరుగా ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందాడు. అయితే వాళ్ళ దాడిలో అగస్త్య చేయి విరిగింది దాంతో ఇన్నాళ్లు చికిత్స పొందాడు. ఇక నిన్న జూబ్లీహిల్స్ పోలీసులను కలిసి నాగార్జున రెడ్డి , అనూష , శ్రావ్య లపై ఫిర్యాదు చేసాడు. అగస్త్య ఫిర్యాదుని స్వీకరించిన పోలీసులు దర్యాప్తు చేసాక కేసు విషయంలో ఒక నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.అగస్త్య పై దాడి చేయడానికి కారణం ఆర్ధిక విషయాలే అని నిర్దారణకు వచ్చిన పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారట. ఆర్ధిక వ్యవహారాల వల్ల ఈ గొడవ జరగడంతో అగస్త్య ఆందోళనగా ఉన్నాడట. తెలుగులోపలు  చిన్న చిత్రాలకు సంగీతం అందించాడు అగస్త్య. సంఘటన జరిగి మూడు వారాలు అవుతుండటంతో ఇన్ని రోజులు ఎందుకు ఫిర్యాదు చేయలేదు అంటూ పోలీసులు ఎదురు ప్రశ్నలు వేస్తున్నారట అగస్త్య పైనే. 

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి