అత్తారింటికి దారేదికి 7 ఏళ్ళు పూర్తి

0
37
atharintiki dareedhi movie completed 7 years

టాలీవుడ్ మూవీ న్యూస్,హైద్రాబాద్పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది చిత్రం విడుదలై సరిగ్గా ఏడేళ్లు పూర్తయ్యింది. 2013 సెప్టెంబర్ 27 న అత్తారింటికి దారేది చిత్రం విడుదల అయ్యింది. అసలు ఈ సినిమా అనూహ్యంగా విడుదల చేయాల్సి వచ్చింది. అక్టోబర్ లో విడుదల చేయాలనీ అనుకున్నారు కానీ ఆలోపే సగానికి పైగా సినిమా నెట్ లో పెట్టేసారు కొంతమంది దాంతో షాక్ అయిన చిత్ర బృందం వెంటనే రిలీజ్ డేట్ ప్రకటించడమే కాకుండా వెంటనే విడుదల చేసింది.

సగానికి పైగా సినిమా అది కూడా హెచ్ డి క్వాలిటీలో జనాలు చూసినప్పటికీ ధైర్యంతో సినిమా విడుదల చేసారు. చాలామంది జనాలు సగానికి పైగా సినిమా చూసినప్పటికీ అత్తారింటికి దారేది చిత్రం విడుదల అయ్యాక బాక్సాఫీస్ ని షేక్ చేసేలా రికార్డులు కట్టబెట్టారు ప్రేక్షక దేవుళ్ళు. మంచి కథ , అందుకు తగ్గ కథనం వీటికి తోడు త్రివిక్రమ్ మాటల మాయాజాలం , పవన్ కళ్యాణ్ నటన , దేవిశ్రీ ప్రసాద్ అందించిన పాటలు మొత్తానికి అత్తారింటికి దారేది చిత్రం రికార్డుల మోత మోగించింది.

2013 లోనే దాదాపు 100 కోట్ల వసూళ్ళని సాధించి చరిత్ర సృష్టించింది ఈ చిత్రం. పవన్ కళ్యాణ్ నటనకు జేజేలు పలికారు ప్రేక్షకులు. పవన్ కళ్యాణ్ సరసన సమంత , ప్రణీత లు నటించారు. ఇక కీలకమైన అత్త పాత్రలో ఒకప్పటి హీరోయిన్ నదియా నటించింది. బ్రహ్మానందం , అలీ , రఘుబాబు , శ్రీనివాస్ రెడ్డి ల కామెడీ ప్రేక్షకులను విశేషంగా అలరించింది. 2013 సెప్టెంబర్ 27 న విడుదలైన అత్తారింటికి దారేది చిత్రం విడుదలై నేటికి 7 ఏళ్ళు పూర్తయిన సందర్బంగా ఆ చిత్రాన్ని గుర్తుకు చేసుకుంటూ పండగ చేసుకుంటున్నారు పవర్ స్టార్ అభిమానులు. 

మునుపటి వ్యాసంకరోనాతో ఆసుపత్రిలో చేరిన హీరో విజయ్ కాంత్
తదుపరి ఆర్టికల్సమంత ఫొటోస్
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి