సూపర్ స్టార్ రజనీకాంత్ నటుడిగా 45 ఏళ్ళు

0
33
rajini 45 years

సూపర్ స్టార్ రజనీకాంత్ నటుడిగా 45 ఏళ్ళు పూర్తి చేసుకున్నాడు. సరిగ్గా 45 సంవత్సరాల క్రితం అపూర్వ రాగంగల్ అనే తమిళ చిత్రంతో నటుడిగా పరిచయం అయ్యాడు. కెరీర్  ప్రారంభంలో కొన్ని నెగెటివ్ పాత్రలు కూడా పోషించాడు. కట్ చేస్తే స్టైల్ కు కేరాఫ్ అడ్రస్ గా నిలిచాడు. ఒక్క తమిళనాడు లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా రజనీకాంత్ నటించిన సినిమాలు విడుదల అవుతుంటాయి. రజనీ సినిమా విడుదల అవుతోందంటే చాలు ప్రేక్షకులకు పెద్ద పండగే.

ఆ సినిమా ఎలా ఉన్నా ఓపెనింగ్స్ మాత్రం అదిరిపోతాయి. ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్లు సాధించగల సత్తా కేవలం రజనీకాంత్ కు మాత్రమే ఉంది. 70  సంవత్సరాల వయసులో కూడా స్పీడ్ గా సినిమాలు చేస్తూ యంగ్ హీరోలకు సవాల్ విసురుతున్నాడు. నటుడిగా 45 ఏళ్ళు పూర్తి చేసుకోవడంతో రజనీకాంత్ కామన్ డిపితో సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నారు రజనీ అభిమానులు అలాగే పలువురు స్టార్ హీరోలు సైతం. తాజాగా రజనీకాంత్ అన్నాతే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా అయిపోవచ్చింది అని అనుకునే లోపు కరోనా మహమ్మారి రావడం వల్ల షూటింగ్ ఆగిపోయింది. కరోనా తగ్గిన తర్వాత బ్యాలెన్స్ షూటింగ్ కంప్లీట్ చేయనున్నారు.

మునుపటి వ్యాసంహీట్ పెంచుతున్న సురేఖా వాణి
తదుపరి ఆర్టికల్ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ల చిత్రానికి బడ్జెట్ ఎంతో తెలుసా
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి