ఆర్ధిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్న సీరియల్ ఆర్టిస్ట్

0
47
TMN logo
TMN logo

కరోనా ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది కుటుంబాలను రోడ్డున పడేసింది. అసలే ఆర్ధిక ఇబ్బందులతో బాధపడుతున్న వాళ్లకు కరోనా దెబ్బ మరింత గట్టిగా తగలడంతో ఇప్పటికే చాలమంది ఆత్మహత్య చేసుకున్నారు. అలాగే కోట్ల సంఖ్యలో ఉపాధి కోల్పోయారు. ఇప్పుడు అదే కోవలో బుల్లితెర నటి
మద్దెల సబీరా అలియాస్ రేఖ (42 ) ఆర్ధిక ఇబ్బందులతో గుంటూరులో ఆత్మహత్య చేసుకుంది. సినిమాల  మీద  మక్కువతో గుంటూరు నుండి హైదరాబాద్ వచ్చింది మద్దెల సబీరా. అయితే సబీరా ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. దాంతో తెలుగులో పలు సీరియల్ లలో జూనియర్ ఆర్టిస్ట్ గా నటించింది.

తనకు మంచి అవకాశాలు రాకపోవడంతో నిరాశతో గుంటూరు కు వెళ్లి అహమ్మద్ అనే వ్యక్తిని  పెళ్లి చేసుకుంది. అయితే కొంతకాలానికే భర్తతో విబేధాలు రావడంతో విడిపోయింది. ఆ తర్వాత చైతన్య ని రెండో పెళ్లి చేసుకుంది. అతడు రియల్ ఎస్టేట్ వ్యాపారం నిర్వహించేవాడు. గతకొంత కాలంగా ఏపీలో రియల్ ఎస్టేట్ వ్యాపారం కుదేలయింది. సరిగ్గా ఇదే సమయంలో కరోనా విలయతాండవం చేయడంతో  రియల్ ఎస్టేట్ లో నష్టాలు వచ్చాయి. దాంతో ఆర్ధిక ఇబ్బందులు తలెత్తాయి మద్దెల సబీరాకు. ఆర్ధిక ఇబ్బందులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది. బాత్ రూం కు వెళ్లిన సబీరా ఎంతసేపటికీ కూడా బయటకు రాకపోవడంతో బాత్ రూం తలుపులు బద్దలు కొట్టి చూడగా అప్పటికే మృతి చెంది ఉంది. ఆత్మహత్య కావడంతో రంగప్రవేశం చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  

మునుపటి వ్యాసంపూరి కూతురు కూడా సినిమాల్లోకి
తదుపరి ఆర్టికల్నటి రాధా ప్రశాంతి పై కేసు నమోదు
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి