అర్జున్ రెడ్డి కాంబినేషన్ లో మరో సినిమా

0
18

2017లో వచ్చిన అర్జున్ రెడ్డి ఎంతటి ప్రభంజనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. సాధారణ హీరోగా ఉన్న విజయ్ దేవరకొండని స్టార్ ని చేసిన చిత్రం అర్జున్ రెడ్డి. కొత్త దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం టాలీవుడ్ ని షేక్ చేసింది. కల్ట్ మూవీగా నిలిచింది అర్జున్ రెడ్డి. కేవలం 4 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన అర్జున్ రెడ్డి తెలుగునాట 51 కోట్ల వసూళ్ళని సాధించి ట్రేడ్ విశ్లేషకులను ఆశ్చర్యానికి గురిచేసింది. కట్ చేస్తే ఇదే చిత్రాన్ని హిందీలో కబీర్ సింగ్ గా రీమేక్ చేస్తే అక్కడ 300 కోట్ల భారీ వసూళ్ళని సాధించి బాలీవుడ్ ని షేక్ చేసింది.

ఇక ఇప్పుడేమో మళ్లీ విజయ్ దేవరకొండ – సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో మరో సినిమా రానున్నట్లు సమాచారం. కరోనా లాక్ డౌన్ కారణంగా అందరికీ ఖాళీ సమయం దొరికింది దాంతో విజయ్ దేవరకొండ కోసం మరో సెన్సేషన్ లాంటి కథ రాసాడట సందీప్ రెడ్డి వంగా. అయితే కథ రాసాడు కానీ ఈ సినిమా ఇప్పట్లో రావడం కష్టమే! ఎందుకంటే విజయ్ దేవరకొండ ఇప్పటికే కొన్ని సినిమాలు కమిట్ అయ్యాడు. అలాగే సందీప్ రెడ్డి రణబీర్ కపూర్ తో సినిమా ప్లాన్ చేస్తున్నాడు. దాంతో ఈ కాంబినేషన్లో సినిమా అంటే మరో రెండేళ్లు ఆగాల్సిందే అని అంటున్నారు. మొత్తానికి అర్జున్ రెడ్డి కాంబినేషన్ లో సినిమా అంటే ప్రేక్షకులకు పండగే అని చెప్పాలి.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి