ఆర్ధిక ఇబ్బందులు, అనారోగ్యంతో బాధపడుతున్న విలన్

0
36

తెలుగు , తమిళ చిత్రాల్లో విలన్ గా నటించిన పొన్నాంబలం ఆర్ధిక ఇబ్బందులు, అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఒకప్పుడు విలన్ గా ఓ వెలుగు వెలిగిన పొన్నాంబలం ఆర్ధిక సమస్యలు చుట్టుముట్టాయి. దానికి తోడు అనారోగ్యం కూడా తోడవడంతో అతడి పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. ప్రస్తుతం చెన్నై లోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో డయాలసిస్ కోసం చేరాడు. అయితే ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స అంటే ఎలా ఉంటుందో తెలుసు కదా….. పెద్ద మొత్తంలోనే డబ్బులు ఖర్చులు పెట్టాలి. కానీ అంతటి స్తోమత లేకపోయింది పొన్నాంబలంకు.

ఈ విషయం విశ్వ నటుడు కమల్ హాసన్ కు తెలియడంతో వెంటనే స్పందించాడు. పొన్నాంబలం వైద్యానికి అయ్యే ఖర్చు అలాగే పిల్లల చదువులు తానే చూసుకుంటానని హామీ ఇవ్వడమే కాకుండా డాక్టర్లకు ఫోన్ చేసి పొన్నాంబలం ఆరోగ్యం గురించి వాకబు చేశాడట కమల్. అంతేనా ఎంత బిల్ అయినా నేనే కడతాను బిల్లు నాకు పంపించండి పొన్నాంబలంకు మెరుగైన వైద్యం అందించాలని కోరాడట కమల్. దాంతో పొన్నాంబలం కుటుంబం కమల్ ని దేవుడిగా భావిస్తోంది. పొన్నాంబలం విలన్ గా రజనీకాంత్ , కమల్ హాసన్ , చిరంజీవి , బాలకృష్ణ ల చిత్రాల్లో నటించాడు.  

మునుపటి వ్యాసంనిర్మాతగా మారుతున్న ప్రభాస్ చెల్లి
తదుపరి ఆర్టికల్బర్త్ డేకు గోవా వెళ్తానంటున్న భామ
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి