తాప్సీ స్థానంలో అనుష్క

0
35
nishabdham movie

టాలీవుడ్ మూవీ న్యూస్,హైద్రాబాద్ – ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ” నిశ్శబ్దం ”. తెలుగు , తమిళ్ , మలయాళం , హిందీ , కన్నడ భాషల్లో అక్టోబర్ 2 న అమెజాన్ లో విడుదల అవుతోంది. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రముఖ రచయిత కోన వెంకట్ కూడా నిర్మాణ భాగస్వామి. ఈ సినిమాని థియేటర్ లో ప్రేక్షకులకు చూపించాలని ప్రయత్నించారు కానీ కరోనా మహమ్మారి వల్ల థియేటర్ లు గత ఆరు నెలలుగా మూసే ఉన్నాయి. ఇక మళ్ళీ అవి తెరుచుకుంటాయో ఇంకా స్పష్టత రాలేదు దాంతో ఇంకా సినిమాని దాచడం కష్టం కాబట్టి అమెజాన్ లో విడుదల చేస్తున్నారు.

ఈ సినిమాలో అనుష్క మెయిన్ హీరోయిన్ గా నటించింది కాబట్టి ఈ కథ అనుష్క కోసమే రాసారని అనుకుంటారు అంతా కానీ అది వాస్తవం కాదని , ముందుగా అనుకున్న కథ ప్రకారం తాప్సీ నటించాల్సి ఉందని , ఆమెతో కథా చర్చలు కూడా జరిగాయని అసలు విషయాన్ని చెబుతున్నాడు దర్శకుడు హేమంత్ మధుకర్. తాప్సీ తో కన్ఫర్మ్ అనుకున్నాం అయితే ఒకసారి కోన వెంకట్ ముంబై నుండి హైదరాబాద్ కు ఫ్లయిట్ లో వస్తున్న సమయంలో అనుష్క కలవడం ఆమెకు కథ చెప్పడం నచ్చడం జరిగింది ఇంకేముంది తాప్సీ స్థానంలో అనుష్క వచ్చి చేరింది.

ఎప్పుడైతే అనుష్క ఓకే చెప్పిందో అప్పడు మా సినిమా స్థాయి పెరిగిందని అంటున్నాడు దర్శకుడు హేమంత్ మధుకర్. మొదట ఈ సినిమాని కంప్లీట్ గా మూకీ సినిమాగా చేయాలనీ పక్కాగా స్క్రిప్ట్ చేసుకున్నామని కానీ అనుష్క వచ్చాకా ఆమె పాత్ర మాత్రమే మూకీ గా మిగతావాళ్లు మాట్లాడేలా మళ్ళీ స్క్రిప్ట్ లో మార్పులు చేయాల్సి వచ్చిందని అందుకే సినిమా కాస్త ఆలస్యం అయ్యిందని…….. ఆలస్యమైనా తప్పకుండా ప్రేక్షకులకు బాగా నచ్చుతుందన్న ధీమా వ్యక్తం చేస్తున్నాడు దర్శకుడు. మరో 11 రోజుల్లో అమెజాన్ లో స్ట్రీమింగ్ కి రానున్న నిశ్శబ్దం అసలు ఫలితం ఎలా ఉంటుందో తేలనుంది.

మునుపటి వ్యాసంబిగ్ బాస్ నుండి ఎలిమినేట్ అయ్యేది ఎవరు ?
తదుపరి ఆర్టికల్భట్టికి గట్టిగా కౌంటర్ ఇచ్చిన తలసాని
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి