అక్టోబర్ 2 న అనుష్క నిశ్శబ్దం

0
20
nishabdham movie

టాలీవుడ్ మూవీ న్యూస్,హైద్రాబాద్ అందాల భామ అనుష్క నటించిన నిశ్శబ్దం చిత్రం ఎట్టకేలకు అక్టోబర్ 2 న డిజిటల్ స్ట్రీమింగ్ కి రానున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ ఈ సినిమా ఏ డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లో  అవుతుందో తెలుసా …………. అమెజాన్ లో. అవును అమెజాన్ లో అక్టోబర్ 2 న స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. డేట్ కూడా కన్ఫర్మ్ చేశారట మేకర్స్. మంచి అమౌంట్ అమెజాన్ ఆఫర్ చేయడంతో ఓటీటీకి ఇచ్చినట్లు తెలుస్తోంది.

అనుష్క ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రంలో తమిళ హీరో మాధవన్ నటించాడు. అలాగే అంజలి , షాలిని పాండే , సుబ్బరాజు తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. తెలుగులోనే కాకుండా తమిళ , మలయాళ , కన్నడ , హిందీ భాషల్లో కూడా విడుదల కానుంది అనుష్క నిశ్శబ్దం. అనుష్క పాత్ర ఈ చిత్రంలో చాలా విభిన్నంగా ఉంటుందని అందుకే అనుష్క ఒప్పుకుందని , రేపు ప్రేక్షకులు కూడా అనుష్క నటనకు ఫిదా అవ్వడం ఖాయమని భావిస్తున్నారు.

ఇక ఈ చిత్రాన్ని కోన వెంకట్ తన మిత్రులతో కలిసి నిర్మిస్తుండగా హేమంత్ మధుకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. అసలు ఈ సినిమా ఏప్రిల్ లో విడుదల కావాల్సి ఉండే కానీ కరోనా వల్ల కుదరలేదు. అలా విడుదల వాయిదా పడుతూ ఇప్పుడు ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అనుష్క ఈ సినిమా తర్వాత నటించే సినిమా ఏంటో ఇంకా ప్రకటించలేదు. ఈ సినిమా విడుదల అయితే కానీ తెలీదు అనుష్క కొత్త సినిమా ఏంటి ? అన్నది. 

మునుపటి వ్యాసంఆర్ ఎక్స్ 100 నిర్మాతని అదుపులోకి తీసుకున్న పోలీసులు
తదుపరి ఆర్టికల్ఈనెల 30 న కోర్టుకు హాజరుకానున్న అద్వానీ
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి