తల్లి కాబోతున్న అనుష్క

0
67
virat kohili going to be father
తల్లి కాబోతున్న అనుష్క

 

అనుష్క తల్లి కాబోతోంది. అనుష్క ఇంకా పెళ్లి చేసుకోలేదు అప్పుడే తల్లి కావడం ఏంటి ? అని షాక్ అవుతున్నారా ? ఈ అనుష్క మన బొమ్మాలి అనుష్క కాదు సుమా …… బాలీవుడ్ బొమ్మ అనుష్క శర్మ. క్రికెట్ వీరుడు విరాట్ కోహ్లీ ని ప్రేమించి పెళ్ళి చేసుకున్న అనుష్క తల్లి కాబోతున్నట్లు ట్వీట్ చేసింది. అంతకుముందు విరాట్ కోహ్లీ కూడా మేము 2021 లో ముగ్గురం అవుతున్నాం అంటూ ట్వీట్ చేసాడు. ప్రస్తుతం ఇద్దరం వచ్చే ఏడాది ముగ్గురం అంటూ విరాట్ కోహ్లీ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. దాంతో విరాట్ కు శుభాకాంక్షలు వెల్లువలా వచ్చి పడుతున్నాయి.

ఇక అనుష్క కు కూడా బాలీవుడ్ ప్రముఖులు, అభిమానుల నుండి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వస్తున్నాయి. గత దశాబ్ద కాలంగా బాలీవుడ్ లో హీరోయిన్ గా రాణిస్తోంది అనుష్క శర్మ. టాప్ హీరోయిన్ లలో ఒకరిగా చెలామణి అవుతున్న ఈ భామ ఓ డాండ్రాఫ్ యాడ్ లో విరాట్ కోహ్లీ తో కలిసి నటించింది. అప్పుడే ఈ ఇద్దరి మనసులు కలిసాయి. క్రమంగా ఆ పరిచయం పెరిగి పెద్దది అయి పీకల్లోతు ప్రేమలో పడ్డారు. అనుష్క శర్మ – విరాట్ కోహ్లీ ప్రేమలో ఉన్నారని అప్పట్లో మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే అబ్బే ….. మామధ్య అలాంటిదేమి లేదని అన్నారు. కట్ చేస్తే పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించి సంచలనం సృష్టించారు.

అయితే పెళ్లి అయినప్పటికీ సినిమాల్లో నటిస్తూ ఇప్పట్లో పిల్లలను కనే ఉద్దేశ్యం లేదని స్పష్టం చేశారు. కట్ చేస్తే కొన్నాళ్ళు కాపురం చేశారు కాబట్టి ఇక పిల్లల మీద గాలి మల్లినట్లుంది. ప్రస్తుతం విరాట్ కోహ్లీ – అనుష్క శర్మ లు దుబాయ్ లో ఉన్నారు. ట్వంటీ ట్వంటీ మ్యాచ్ లు దుబాయ్ లో జరుగనున్న విషయం తెలిసిందే. దుబాయ్ నుండే ఈ శుభవార్త వెల్లడించారు ఇద్దరూ. దాంతో విరాట్ – అనుష్క ల అభిమానులు చాలా సంతోషిస్తున్నారు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి