అనుష్క సినిమాలకు గుడ్ బై చెప్పనుందా ?

0
47

సాలిడ్ అందాల భామ అనుష్క సినిమాలకు గుడ్ బై చెప్పనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అనుష్క ఇక పెళ్లి చేసుకోవడం ఖాయమని అందుకే కొత్త సినిమాలను అంగీకరించడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. అనుష్క కు పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నారు కుటుంబ సభ్యులు. కన్నడ భామ అయిన అనుష్క కు స్టార్ హీరోల మాదిరిగా మంచి పేరుంది. స్టార్ హీరోల మాదిరిగానే స్టార్ డం ఉంది అనుష్క కు . హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది అనుష్క .

చాలాకాలంగా ఇంట్లో వాళ్ళు పెళ్లి చేసుకోమని అనుష్క ని పోరు పెడుతున్నారట. అయితే ఎప్పటికప్పుడు వాయిదాల మీద వాయిదాలు వేస్తూ నెట్టుకుంటు వస్తోంది అనుష్క. అయితే ఈసారి మాత్రం పెళ్లి తప్పనిసరిగా అవుతుందని అంటున్నారు. తాజాగా అనుష్క నటించిన నిశ్శబ్దం చిత్రం విడుదలకు సిద్దంగా ఉంది. కానీ కరోనా వల్ల ఆ సినిమా విడుదల కాలేదు. కరోనా ఎప్పుడు అదుపులోకి వస్తుందో థియేటర్లు ఎప్పుడు ఓపెన్ అవుతాయో తెలియని పరిస్థితి నెలకొని ఉంది.

మునుపటి వ్యాసంమహేష్ బాబు తల్లిగా ఆ హీరోయిన్ నటిస్తోందా?
తదుపరి ఆర్టికల్సొగసు చూడ తరమా చిత్రానికి 25 ఏళ్ళు
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి