ప్రపంచం నెత్తిన మరో పిడుగు : కొత్త వైరస్

0
12
Another Virus Man Dies Of Hantavirus In China

ప్రపంచం నెత్తిన మరో పిడుగు పడింది , ఇప్పటికే కరోనా వైరస్ తో యావత్ ప్రపంచం అతలాకుతలం అవుతున్న నేపథ్యంలో చైనాలో మరో కొత్త వైరస్ ప్రపంచాన్ని మరింత వణికేలా చేస్తోంది. కోవిడ్ 19 వైరస్ చైనాలోనే పుట్టగా ఇప్పుడు కూడా కొత్త వైరస్ హంటా వైరస్ కూడా చైనాలో పుట్టుకు రావడం సంచలంగా మారింది. కరోనా వైరస్ కే ఇంతవరకు వ్యాక్సిన్ కనుక్కోలేదు ఇక ఇప్పుడేమో మరో కొత్త వైరస్ హంటా పుట్టుకురావడంతో ప్రపంచ మానవాళికి పెను సవాల్ గా మారింది.

చైనాలో ఓ వ్యక్తికి హంటా వైరస్ సోకినట్లు దాంతో అతడు వెనువెంటనే చనిపోయినట్లు తెలుస్తోంది. అంతేకాదు హంటా వైరస్ బారిన మరో 30 మంది వరకు పడినట్లు తెలుస్తోంది. అయితే హంటా వైరస్ ఎలుకల వల్ల వస్తున్నట్లు తెలుసుకున్నారు. ఎలుకల లాలాజలం , అలాగే ఎలుకల వ్యర్ధాలతో ఈ వ్యాధి సోకుతున్నట్లుగా ప్రకటించారు వైద్యులు. ఇప్పటికే కరోనా తో వణికిపోతున్న ప్రజలకు ఇప్పుడు హంటా నిద్రలేకుండా చేసేలా కనిపిస్తోంది. ఇండ్లల్లో ఉన్న ఎలుకలను తరమడమే హంటా వైరస్ ని ఎదుర్కోవడమని అంటున్నారు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి