మరో విషాదం : ఆత్మహత్య చేసుకున్న మరో నటుడు

0
39

సినిమా, టివి రంగంలో ఉన్నవాళ్లు వరుసగా ఆత్మహత్య లకు పాల్పడుతున్నారు. ఇప్పటికే పలువురు నటీనటులు ఆత్మహత్య చేసుకోగా తాజాగా కన్నడ టివి, సినీ నటుడు సుశీల్ గౌడ ఆత్మహత్య చేసుకున్న విషయం సంచలనంగా మారింది. కర్ణాటక లోని మాండ్య లో ఉంటున్న సుశీల్ గౌడ ఆత్మహత్య ఒక్కసారిగా టివి , సినిమా రంగంలో ప్రకంపనలు సృష్టించింది. పలు సీరియల్ లలో నటించిన సుశీల్ గౌడ దునియా విజయ్ హీరోగా నటించిన ఓ చిత్రంలో కూడా విలన్ గా నటించాడు ఆ సినిమా ఇంకా విడుదల కాకుండానే సుశీల్ గౌడ ఆత్మహత్య చేసుకోవడంతో సుశీల్ గౌడ తెలిసిన వాళ్ళు షాక్ అవుతున్నారు.

సుశీల్ గౌడ ఫిట్ నెస్ ట్రైనర్ కూడా. మంచి ఫిట్ నెస్ తో హీరోలను సైతం షాక్ అయ్యేలా చేసిన ఈ నటుడు అర్దాంతరంగా చనిపోవడం అందరిని షాక్ అయ్యేలా చేస్తోంది. ఇక హీరో దునియా విజయ్ అయితే తీవ్రంగా బాధపడుతున్నాడు. హీరోకు కావాల్సిన అన్ని అర్హతలు ఉన్న వ్యక్తి సుశీల్ గౌడ నా సినిమాలో విలన్ గా నటించడం చూసి షాక్ అయ్యాను. ఎంతో మంచి భవిష్యత్తు ఉన్న సుశీల్ ఆత్మహత్య నన్ను తీవ్రంగా కలిచివేసింది అంటూ పోస్ట్ చేసాడు. మిగతా నటీనటులు కూడా సుశీల్ గౌడ మృతి పట్ల తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసారు.

మునుపటి వ్యాసంమెగాస్టార్ చిరంజీవి సినిమాలో విజయ్ దేవరకొండ
తదుపరి ఆర్టికల్సీనియర్ నటి ఆరోగ్యం విషమం : ఆసుపత్రిలో చికిత్స
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి