విజయ్ దేవరకొండ ఖాతాలో మరో రికార్డ్

0
70
vijay devara konda

విజయ్ దేవరకొండ ఖాతాలో మరో రికార్డ్

డియర్ కామ్రేడ్ చిత్రం తెలుగులో అంతగా ఆడలేదు కానీ హిందీలో డబ్ చేసి యూట్యూబ్ లో పెడితే మాత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచింది. 7 నెలల క్రితం డియర్ కామ్రేడ్ చిత్రాన్ని యూట్యూబ్ లో పెట్టగా ఇప్పటి వరకు 160 మిలియన్ల కు పైగా వ్యూస్ వచ్చాయి. అలాగే 2 మిలియన్ల లైక్స్ వచ్చాయి ఈ చిత్రానికి. లైక్స్ పరంగా ఎవర్ గ్రీన్ రికార్డ్ ఇది దాంతో 2 మిలియన్ లైక్స్ అందుకున్న చిత్రంగా డియర్ కామ్రేడ్ అరుదైన ఘనత సాధించి మొట్టమొదటి చిత్రంగా రికార్డ్ సృష్టించింది డియర్ కామ్రేడ్.

నూతన దర్శకుడు భరత్ కమ్మ దర్శకత్వంలో డియర్ కామ్రేడ్ చిత్రం తెరకెక్కింది. విజయ్ దేవరకొండ మేనమామ యశ్ రంగినేని ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరు కావడం విశేషం. రష్మీక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంపై విజయ్ దేవరకొండ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. కానీ సినిమా విడుదల అయ్యాక అతడి ఆశలపై నీళ్లు చల్లుతూ డిజాస్టర్ అయ్యింది. అయితే జస్టిన్ ప్రభాకరన్ అందించిన పాటలు ఈ చిత్రంలో సూపర్ హిట్ గా నిలిచాయి. అయితే పాటలు చిత్ర విజయానికి ఉపయోగపడలేకపోయాయి. మంచి సందేశంతో వచ్చిన ఈ చిత్రం నిడివి ఎక్కువ కావడం కూడా కొంత సినిమా పరాజయానికి కారణం .

తెలుగు , తమిళ , మలయాళ , కన్నడ భాషల్లో ఏకకాలంలో విడుదల అయినప్పటికీ అక్కడ విజయం సాధించకపోయినా యూట్యూబ్ లో మాత్రం సంచలనం సృష్టిస్తోంది. దాంతో విజయ్ దేవరకొండ ఖాతాలో మరో గొప్ప రికార్డ్ వచ్చిపడింది. గతకొంత కాలంగా పలు రికార్డులు సృష్టిస్తున్నాడు విజయ్ దేవరకొండ. మోస్ట్ డిజైరబుల్ పర్సన్ గా పలుమార్లు ఎంపికయ్యాడు ఈ హీరో. యూత్ లో ఎనలేని క్రేజ్ సంపాదించుకున్న విజయ్ దేవరకొండ తాజాగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఫైటర్ అనే పాన్ ఇండియా చిత్రంలో నటిస్తున్నాడు. బాలీవుడ్ భామ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది. కరోనా తగ్గుముఖం పట్టిన తర్వాత ఫైటర్ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి