ప్రభాస్ ఫ్యాన్స్ కు  మరో సినిమా

0
49
prabhas may do next with neel

టాలీవుడ్ మూవీ న్యూస్,హైద్రాబాద్-యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ కు పూనకం వచ్చేలా మరో సినిమా ప్లాన్ చేశాడట. ఇక ఈ సినిమా ప్రకటన కూడా త్వరలోనే రానున్నట్లు సమాచారం. కేజీఎఫ్ చిత్రంతో యావత్ భారతదేశాన్ని ఒక ఊపు ఊపిన దర్శకుడు ప్రశాంత్ నీల్. కన్నడ చిత్రంగా తెరకెక్కిన కేజీఎఫ్ దేశ వ్యాప్తంగా విడుదలై సంచలన విజయాన్ని సాధించింది. మాములు హీరోగా ఉన్న యశ్ ని పాన్ ఇండియా స్టార్ ని చేసింది. మాస్ కు అసలు సిసలైన నిర్వచనంగా నిలిచిన దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నటించాలని పలువురు స్టార్ హీరోలు ఆశపడేలా చేసాడు ప్రశాంత్ నీల్.

స్టార్ హీరోలకు అలాంటి ఆలోచన వచ్చిందే తడవుగా పలువురు స్టార్ హీరోలకు గాలం వేసే పనిలో పడ్డాడు. అందుకే యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ఓ సినిమా కమిట్ అయ్యాడు ప్రశాంత్ నీల్. ఇక ఇప్పుడేమో ప్రభాస్ వంతు వచ్చింది. బాహుబలి చిత్రంతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు ప్రభాస్. అలాగే ప్రపంచ వ్యాప్తంగా కూడా మంచి మార్కెట్ ఏర్పడింది ప్రభాస్ కు అందుకు నిదర్శనమే సాహో చిత్రం. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన సాహో చిత్రానికి ప్లాప్ టాక్ వచ్చినప్పటికి ప్రపంచ వ్యాప్తంగా 430 కోట్లు వసూల్ చేసింది.

ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లలో దుమ్ము దులపగల సత్తా ఉన్న హీరో ప్రభాస్ కాబట్టి అతడితో ప్రశాంత్ నీల్ లాంటి మాస్ దర్శకుడు సినిమా చేస్తే ఇక ఆ వసూళ్ల ప్రభంజనం గురించి కొత్తగా చెప్పేదేముంది. వసూళ్ల సునామీ సృష్టించడం ఖాయం. అందుకే ప్రభాస్ – ప్రశాంత్ నీల్ లు కలిసి ఓ పవర్ ఫుల్ సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా ప్రకటన అధికారికంగా త్వరలోనే ప్రకటించనున్నారట. ఈ ఇద్దరి కాంబినేషన్లో సినిమా అంటే డార్లింగ్ ఫ్యాన్స్ కు పూనకం రావడం ఖాయం. ప్రభాస్ తాజాగా రాధే శ్యామ్ చిత్రం చేస్తుండగా దాని తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఒక సినిమా ఓం రౌత్ దర్శకత్వంలో ఆది పురుష్ అనే సినిమా చేయనున్నాడు.

మునుపటి వ్యాసంవిడాకులు తీసుకున్న టాలీవుడ్ జంట
తదుపరి ఆర్టికల్సైలెంట్ గా ఎంగేజ్ మెంట్ చేసుకున్న నటి
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి