డ్రగ్స్ కేసులో మరో హీరోయిన్ అరెస్ట్

0
32
sanjana heroine

టాలీవుడ్ మూవీ న్యూస్,బెంగళూరు-  డ్రగ్స్ కేసులో మరో హీరోయిన్ అరెస్ట్ అయ్యింది. కర్ణాటకలో సంచలనం సృష్టిస్తున్న డ్రగ్స్ కేసులో ఇప్పటికే హీరోయిన్ రాగిణి ద్వివేదిని అరెస్ట్ చేసారు కర్ణాటక పోలీసులు. తాజాగా ఈరోజు మరో హీరోయిన్ సంజనని అరెస్ట్ చేసారు పోలీసులు. ఈరోజు ఉదయం సంజన ఇంట్లోకి ప్రవేశించిన పోలీసులు సోదా నిర్వహించారు అనంతరం సంజనని అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు పోలీసులు. కన్నడ చిత్ర పరిశ్రమని డ్రగ్స్ కేసు ఒక ఊపు ఊపేస్తోంది. ఇప్పటికి హీరోయిన్ లు  రాగిణి ద్వివేది , సంజన లను అరెస్ట్ చేసిన పోలీసులు మరికొంత మందిని అరెస్ట్ చేసే పనిలో ఉన్నారట.

సంజన తెలుగులో పలు చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన బుజ్జిగాడు చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా నటించింది సంజన. ప్రభాస్ హీరోగా నటించిన బుజ్జిగాడు చిత్రంతోనే తెలుగుతెరకు పరిచయం అయ్యింది సంజన. ఆ తర్వాత పలు చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది అయితే అంతగా సక్సెస్ కాలేకపోయింది పాపం తెలుగునాట. దాంతో కన్నడంలోనే తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది.

అయితే సినిమాల్లో హీరోయిన్ గా వచ్చిన స్టార్ డం కంటే ఎక్కువగా ఇలా డ్రగ్స్ కేసులో ఇరుక్కొని వివాదంలోకి ఎక్కింది సంజన. గత 15 రోజులుగా కర్ణాటకలో డ్రగ్స్ కేసు కలకలం సృష్టిస్తోంది. సంజన , రాగిణి ద్వివేది సన్నిహితులను అరెస్ట్ చేసిన పోలీసులు వాళ్ళ నుండి అన్ని రకాల విషయాలను కూపీ లాగిన తర్వాతే రాగిణి ద్వివేదితో పాటుగా సంజన లను అరెస్ట్ చేసారు పోలీసులు. ఇద్దరు హీరోయిన్ లు అరెస్ట్ కావడం ఇది డ్రగ్స్ కేసు కావడంతో వైరల్ గా మారింది. 

మునుపటి వ్యాసంచైతూకి రాఖీ కడతానని వార్నింగ్ ఇచ్చిందట
తదుపరి ఆర్టికల్వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న సీరియల్ నటి
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి